
కూడేరు : యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి గజమాల తెగిపడింది. అది నేరుగా లోకేష్ పై పడింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అభిమానులు ఒకసారిగా రావడంతో తోపులాట కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో లోకేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు. పాదయాత్రలో భాగంగా నిన్న ఉరవకొండలో పర్యటించారు. వైసీపీ హయాంలో బిసి, ఎస్సి, మైనార్టీ వర్గాలు దాడులకు గురయ్యాయని నారా లోకేష్ వైసీపీ మీద ధ్వజమెత్తారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీకి అంతిమయాత్ర అవుతుందని జోస్యం చెప్పారు.