స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: లోకేష్‌ను అప్పటివరకు అరెస్ట్ చేయొద్దు.. ఏపీ హైకోర్టు..

Published : Oct 04, 2023, 05:47 PM IST
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: లోకేష్‌ను అప్పటివరకు అరెస్ట్ చేయొద్దు.. ఏపీ హైకోర్టు..

సారాంశం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌‌ను ఈ నెల 12 వరకు హైకోర్టు పొడిగించింది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌‌ను ఈ నెల 12 వరకు హైకోర్టు పొడిగించింది. హైకోర్టులో బుధవారం నారా లోకేష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. మరోవైపు తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హైకోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే లోకేష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అప్పటివరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దని..  ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు  ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యూడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో లోకేష్ పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతామని సీఐడీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా.. లోకేశ్‌ను ఇంకా నిందితుడిగా పేర్కొనలేదని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో తాను నిందితుడిని కాదని లోకేష్ చెబుతున్నందున.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్‌ను అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయకుండా సీఐడీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations