నంద్యాలలో టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన జయచంద్రారెడ్డి

Published : Mar 05, 2021, 02:53 PM IST
నంద్యాలలో టీడీపీకి షాక్: వైసీపీలో చేరిన జయచంద్రారెడ్డి

సారాంశం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూల్ జిల్లా నంద్యాలలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఫరూక్ అనుచరుడు జయచంద్రారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి సమక్షంలో శుక్రవారం నాడు ఆయన వైసీపీలో చేరారు.సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న జయచంద్రారెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతలకు షాక్ కు గురి చేసింది.

నంద్యాల: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూల్ జిల్లా నంద్యాలలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఫరూక్ అనుచరుడు జయచంద్రారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి సమక్షంలో శుక్రవారం నాడు ఆయన వైసీపీలో చేరారు.సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న జయచంద్రారెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతలకు షాక్ కు గురి చేసింది.

మున్సిపల్ ఎన్నికల సమయంలో టీడీపీకి చెందిన కీలక నేత ఆ పార్టీని వీడడం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి నెలకొంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. 

మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్ధులు వెనక్కి తగ్గారు. నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత వైసీపీలో చేరారు. లేదా నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు.నంద్యాలలో టీడీపీ కీలక నేత జయచంద్రారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఆ పార్టీ నేతలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్