ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్‌.. బాలికను బైక్‌పై మధ్యలో కూర్చొపెట్టి పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు

Published : May 19, 2022, 04:07 PM IST
ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్‌.. బాలికను బైక్‌పై మధ్యలో కూర్చొపెట్టి పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు

సారాంశం

నంద్యాల జిల్లాలో ని ఆత్మకూరు నుంచి ఓ మైనర్ బాలికను ఆళ్లగడ్డ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు బాలికను తీసుకెళ్లిన విధానంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

నంద్యాల జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు.. ఆత్మకూరు మండలం సిద్ధాపురంకు చెందిన ఓ మైనర్ బాలికను  పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారు బాలికను తీసుకెళ్లిన విధానం వివాదం నెలకొంది. వివరాలు.. బాలికను ఓ కేసులో అనుమానితురాలిగా భావించిన ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను ఆత్మకూరు నుంచి తీసుకెళ్లారు. ఇద్దరు కానిస్టేబుల్స్ బాలిక ఆటోలో వెళ్తుండగా అడ్డగించి.. బైక్‌పై తీసుకెళ్లారు. ఇద్దరు మగ పోలీసులు బైక్‌పై బాలికను వారి మధ్యలో కూర్చొబెట్టి తీసుకెళ్లారు. 

మరోవైపు ఈ విషయంలో తమకు సమాచారం లేదని స్థానిక ఆత్మకూరు పోలీసులు చెబుతున్నారు. స్థానిక పీఎస్‌కు సమాచారం లేదని ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఇక, పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు  కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం