రెండు రోజులుగా ఎంటరర్‌టైన్ మెంట్ షో: భూమా అఖిలప్రియపై శిల్పా రవి

Published : Feb 04, 2023, 09:38 PM IST
రెండు రోజులుగా  ఎంటరర్‌టైన్ మెంట్ షో: భూమా అఖిలప్రియపై  శిల్పా రవి

సారాంశం

రెండు రోజులుగా  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  తనపై  చేసిన ఆరోపణలపై నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి  స్పందించారు.  భూమా అఖిలప్రియ  ఎంటర్ టైన్ మెంట్ షో నిర్వహిస్తున్నారన్నారు.   

నంద్యాల: రెండు రోజులుగా  భూమా అఖిలప్రియ  ఎంటర్ టైన్ మెంట్  షో నడుపుతుందని  నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి విమర్శించారు. శనివారం నాడు  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  ఆరోపణలపై  శిల్పా రవి  స్పందించారు.  తాను భూ కుంభకోణాలకు  పాల్పడినట్టుగా  నమ్మించే  ప్రయత్నం  చేస్తుందని  ఆయన  చెప్పారు.  అఖిలప్రియ  చేసిన ఆరోపణల్లో  నిజం లేదన్నారు. ఆమె ఆరోపణలపై రేపు  ఉదయం వివరణ ఇస్తానని  చెప్పారు. 

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి  టీడీపీలో  చేరే ప్రయత్నం చేస్తున్నారని  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం   ఆరోపించారు.  టీడీపీ నాయకులతో  రవి  టచ్ లో  ఉన్నారని కూడా ఆమె  చెప్పారు.ఈ నెల  4వ తేదీన  శిల్పారవి  అక్రమాలను ఆధారాలతో  బయటపెడతానిన  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  ప్రకటించారు. 

also read:టీడీపీలో చేరేందుకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి యత్నం: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ఇవాళ  ఉదయం నుండి మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్  అరెస్ట్  చేశారు. శిల్పా రవిపై  తాను  చేసిన ఆరోపణలను బయటపెడతానని చెప్పారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో  నంద్యాలలో  ఉద్రిక్తతలు  చోటు  చేసుకున్నాయి. దీంతో   పోలీసులు ముందు జాగ్రత్త  చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రి  అఖిలప్రియను  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే