చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. బాలకృష్ణ

Published : Sep 21, 2023, 10:25 AM IST
చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. బాలకృష్ణ

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్ అంశాన్ని ప్రజాక్షేత్రంలోని తేల్చుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్ అంశాన్ని ప్రజాక్షేత్రంలోని తేల్చుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని చెప్పారు. ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వెంకటపాలెంలో ఎన్ఠీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలోనే అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. అలాగే టీడీపీ సభ్యులతో కలిసి సభకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వచ్చారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని అన్నారు. తమ పార్టీ ప్రజల్లో ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పారు. 

Also Read: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. దమ్ముంటే రా అంటూ అంబటి కౌంటర్.. తొడగొట్టిన బియ్యం మధుసూదన్

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై గళమెత్తటమే తమ ప్రధాన అజెండా అని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఇక, చంద్రబాబుపై కక్ష-యువత భవితకు శిక్ష అంటూ టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. షెల్ కంపెనీల సృష్టికర్త జగన్ రెడ్డి అని రాసి ఉన్న ఫ్లకార్డును ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రదర్శించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP & Telangana Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు | Asianet Telugu
అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం@ అమరావతి | CM Chandrababu Naidu Fire Vehicles Launch