ఏపీ అసెంబ్లీలో గందరగోళం, దండం పెట్టిన స్పీకర్: వాయిదా

By narsimha lode  |  First Published Sep 21, 2023, 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైన  వెంటనే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.దీంతో  ఏపీ అసెంబ్లీని వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం



అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యులు పోటా పోటీగా నిరసనలకు దిగారు. దీంతో  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది.  దీంతో  ఏపీ అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే  ప్రశ్నోత్తరాలను  చేపట్టారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై  తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు  టీడీపీ సభ్యులు  ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద  టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించారు.  అదే సమయంలో టీడీపీ  ఎమ్మెల్యే  బాలకృష్ణ  మీసం తిప్పారు.  బాలకృష్ణ వ్యవహరించిన తీరును  ఏపీ మంత్రి అంబటి రాంబాబు  తప్పు బట్టారు. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. సినిమాల్లోనే  మీసాలు తిప్పడాన్ని  సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబు సూచించారు.అదే సమయంలో  వైసీపీ సభ్యులు కూడ  నిరసనకు దిగారు.ఈ పరిస్థితుల్లో  గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Videos

undefined

also read:చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం: టీడీపీ సభ్యుల ఆందోళనలపై బుగ్గన ఆగ్రహం

వైసీపీ నుండి  టీడీపీలో చేరిన  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించిన తీరును వైసీపీ సభ్యులు తప్పుబట్టారు.  పోడియం వద్ద  ఉన్న బాటిళ్లను  విరగొట్టేందుకు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ప్రయత్నించారు. వైసీపీ నుండి టీడీపీకి మద్దతుగా నిలిచిన  ఉండవల్లి శ్రీదేవి కూడ టీడీపీ సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.  టీడీపీ సభ్యుల  నిరసనలపై  ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  అంబటి రాంబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. ఈ సమయంలో  సభను ఆర్డర్ లో పెట్టేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రయత్నించారు. తన స్థానంలో లేచి నిలబడి దండం పెట్టి  సభ్యులను కూర్చోవాలని కోరారు. అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో  10 నిమిషాల పాటు  వాయిదా వేస్తున్నట్టుగా  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

 


 

click me!