టీటీడీ పై నమిత అసంతృప్తి

Published : Jul 10, 2021, 02:27 PM IST
టీటీడీ పై నమిత అసంతృప్తి

సారాంశం

టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని తెలిపారు. గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత అన్నారు. 


సినీ నటి నమిత.. నేడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఆమె టీటీడీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నమిత మీడియాతో మాట్లాడారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. 

టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని తెలిపారు. గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత అన్నారు. 

మరోవైపు తాను నటించిన  భౌభౌ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అలాగే నమిత థియేటర్ పేరుతో ఓటీటీ యాప్, నిర్మాణ సంస్థను ప్రారంభించామని నమిత వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?