టిడిపిలో చేరుతున్న నల్లారి కిషోర్

First Published Nov 23, 2017, 10:58 AM IST
Highlights
  • నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం తెలుగుదేశంపార్టీలో చేరుతున్నారు.

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం తెలుగుదేశంపార్టీలో చేరుతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో నల్లారి కుటుంబం కూడా ఒకటి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్రానికి మూడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన విషయం అందరకీ తెలిసిందే. కిరణ్ సోదరుడే కిషోర్. తన కొడుకు అమరనాధరెడ్డితో పాటు నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులతో కలిసి చంద్రబాబునాయుడు సమక్షంలో సాయాంత్రం ఓ హోటల్లో జాయినవుతున్నారు.

 

పార్టీ చేరిక విషయంలో కిషోర్ కు చంద్రబాబు తగిన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కిషోర్ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయటానికి చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. అదే విధంగా తమ కుటుంబంలో ఒకరికి ఎంఎల్సీగా అవకాశం ఇవ్వటానికి కూడా చంద్రబాబు ఒప్పుకున్నారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా నల్లారి కిషోర్ చేరికపై జిల్లాలోనే మిశ్రమ స్పందన కనబడుతోంది. ఎందుకంటే, నల్లారి కుటుంబానికి ఒక్క పీలేరు నియోజకవర్గంలో తప్ప ఇంకెక్కడా పట్టులేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

అటువంటిది నల్లారి కిషోర్ ను చేర్చుకున్నందు వల్ల పార్టీకి అదనంగా వచ్చే ఉపయోగిలేంటి అన్నది పలువురు నేతలకు అర్ధం కావటం లేదు. కాకపోతే చంద్రబాబుతో పాటు ఫిరాయింపు మంత్రి ఎన్. అమరనాధ్ రెడ్డికి, నల్లారి కుటుంబానికి వైసిపి పెద్ద దిక్కు పుంగనూరు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డికి బద్ద వైరముంది. అందుకనే పెద్దిరెడ్డి వ్యతిరేకులను ఒకటి చేసి టిడిపిలో చేర్చుకోవాల్సిన అవసరం అటు చంద్రబాబుతో పాటు ఇటు అమరనాధ్ రెడ్డికి కూడా ఉంది. అందుకనే నల్లారి కిషోర్ ను టిడిపిలో చేర్చుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు చేస్తున్న కసరత్తులు ఏ స్ధాయిలో పనిచేస్తాయో చూడాలి

click me!