మేనిఫెస్టో ట్రైలర్ కే జగన్ కు చెమటలు... అసలు సినిమా ముందుంది : మాజీ మంత్రి సంచలనం

By Arun Kumar PFirst Published Jun 9, 2023, 5:12 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీ ఇటీవల మహానాడు సందర్భంగా విడుదల చేసిన భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టోపై ఆ పార్టీ నేత నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసాారు. 

గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఇటీవల విడుదలచేసిన మేనిఫెస్టో కేవలం ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది అని  మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ట్రైలర్ కే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి నాయకులకు చెమటలు పడితే సినిమా చూస్తే పరిస్థితి ఏంటో అంటూ ఎద్దేవా చేసారు. భవిష్యత్తు గ్యారెంటీ మ్యానిఫెస్టో అమలు సాధ్యమేనని... దీనిపై ఏవయినా అనుమానాలుంటే వైసీపీ నేతలు తమతో చర్చలకు రావాలని ఆనంద్ బాబు సవాల్ విసిరారు. 

టిడిపి 'భవిష్యత్తుకు గ్యారెంటీ మ్యానిఫెస్టో'పై గుంటూరు తూర్పు నియోజవర్గం ఇంచార్జి మహమ్మద్ నజీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్ధాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆనంద్ బాబు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలతో మేనిఫెస్టో పై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.... అమలు సాధ్యమయ్యే హామీలనే టిడపి మేనిఫెస్టోలో పొందుపర్చామని అన్నారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచడం, పేదలను సుసంపన్నులను చేయడం, అన్ని వర్గాలకు భరోసా కల్పించడమే  టిడిపి ఎంజెండా... టిడిపి మేనిఫెస్టోలోని హామీలు అమలయితే ఇది సాధ్యమన్నారు. 

రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'భవిష్యత్ కు గ్యారంటీ' మేనిఫెస్టో ప్రకటించారని ఆనంద్ బాబు అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి తీరతామన్నారు. టిడిపి మేనిఫెస్టో గ్రామస్థాయి వరకు, అన్ని వర్గాల ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేందుకు 150 రోజుల కార్యాచరణ రూపొదించామని... త్వరలోనే చంద్రబాబు దీన్ని ప్రకటిస్తారని ఆనంద్ బాబు వెల్లడించారు. 

Read More  2024లో ఏపీలో బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వం: సీఎం రమేష్

ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది టీడీపీ పాలనతోనే సాధ్యమన్నారు ఆనంద్ బాబు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు టిడిపి అధికారంలోకి రాగానే అమ్మకు వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ సంవత్సరానికి రూ. 15 వేల చొప్పున తల్లులు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని... ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందజేస్తామని మాజీ మంత్రి ఆనంద్ బాబు తెలిపారు. 

అన్నదాత పధకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేల రూపాయలు ఖాతాల్లో వేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు రూ. 3 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. పార్ములా –4 తో పేదవాడిని ధనికుడిగా మార్చడమే చంద్రబాబు నాయుడు గారి అంతిమ లక్ష్యమని ఆనంద్ బాబు అన్నారు. 

భవిష్యత్తు గ్యారెంటీ మ్యానిపెస్టో కరతపత్రాన్ని ప్రతి ఇంటికి పంచి ప్రజల్లో అవగాహన కల్పించాలని టిడిపి నేతలకు మాజీ మంత్రి సూచించారు. ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని మాజీ మంత్రి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. 

click me!