వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏర్పడే ప్రభుత్వంలో బీజేపీ పాత్ర ఉంటుందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.
విశాఖపట్టణం: వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వం అధికారంలోకి రానుందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.శుక్రవారంనాడు విశాఖపట్టణంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు.అమిత్ షాతో చాలా మంది నేతలు భేటీ అవుతారన్నారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీపై సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేప్పారు.ఈ ఇద్దరు నేతల భేటీలో ఏం జరిగిందో వారే చెప్పాలన్నారు.పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమన్నారు.
ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే విపక్ష పార్టీలన్నీ ఏకతాటి మీదికి రావాలని .పవన్ కళ్యాణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకావం ఉందని ఈ రెండు పార్టీ నేతల నుండి సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నేతలు మధ్య మరిన్ని సమావేశాలు జరుగుతాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే.