అమరావతి అచ్చం సింగపూర్ లా ఉంటుంది: చంద్రబాబు

First Published May 15, 2017, 7:20 AM IST
Highlights

అమరావతి అచ్చం సింగపూర్ లా ఉంటుంది. ఎపీకి సింగపూర్‌కి ఎన్నో సారూప్యతలు వున్నాయి.గతంలో ఎంతో నిబద్దతతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను.సింగపూర్ ఎంతో క్రమశిక్షణ కలిగిన దేశం.సింగపూర్ 3 దశలలో అందించిన మాస్టర్ ప్లాన్ మాకు కలిసొచ్చింది.అందరూ రాజధాని నిర్మాణం అసాధ్యం అన్నారు, కొన్ని చిక్కులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి ఇప్పుడు స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ సంస్థతోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. రెండేళ్లలో  సింగపూర్ కన్సార్టియం తన సామర్ధ్యం చూపించాలి.

సింగపూర్ దేశానికి ఒక కేరక్టర్ వుంది, అవినీతి మచ్చలేని దేశం ఏదైనా వుందంటే అందులో ముందువరుసలో వుండేది సింగపూరే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ రోజు సింగపూర్ భజన చేశారు.

విజయవాట గేట్ వే హోటల్ లో అమరావతి స్టార్ట్ అప్ సిటి నిర్మాణానికి సంబంధించి  సింగపూర్ కన్సార్టియం తో ఒప్పందం కుదుర్చుకున్నాక ఆయన సింగపూర్ను  తెగపొగిడేశారు. 

 

ఈ వరవడిలో ఆయన అమరావతి అచ్చం సింగపూర్ లా ఉంటుందని కూడా చెప్పారు.

 

ఆయన ప్రసంగంలోని ఆణిముత్యాలు:

 

2014 డిసెంబరులో మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ముందుకొచ్చింది, 6 నెలల వ్యవధిలోనే మాస్టర్ ప్లాన్ అందించింది. సింగపూర్ నుంచి ఇంతమంది ప్రతినిధులతో కూడిన బృందం ఇక్కడికి రావడం ఏపీ పట్ల వారి నిబద్దతను చాటుతోంది.నూతన రాజధాని అచ్చం సింగపూర్‌లా వుండాలని మొదటి నుంచి కోరుకుంటున్నా.ఏపీకి సింగపూర్‌కి ఎన్నో సారూప్యతలు వున్నాయి.గతంలో ఎంతో నిబద్దతతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను.కృష్ణా నది మన రాజధానికి అదనపు బలం.30, 40 కిలోమీటర్ల మేర కృష్ణానదికి ఇరువైపులా అభివృద్ధి జరుగుతుంది.సింగపూర్ ఎంతో క్రమశిక్షణ కలిగిన దేశం.సింగపూర్ 3 దశలలో అందించిన మాస్టర్ ప్లాన్ మాకు కలిసొచ్చింది.అందరూ రాజధాని నిర్మాణం అసాధ్యం అన్నారు, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.40 వేల కోట్ల విలువైన 33 వేల ఎకరాల భూమిని రూపాయి ఖర్చు లేకుండా రైతులనుంచిసేకరించా. ఆరంభంలో కొన్ని చిక్కులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి ఇప్పుడు స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ సంస్థతోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. రెండేళ్లలో  సింగపూర్ కన్సార్టియం సామర్ధ్యం చూపించాలి.

 

సింగపూర్ మీద ప్రశంసల జల్లు కురిపించడంతో   సమావేశంలో  పాల్గొన్న సింగపూర్ పరిశ్రమల మంత్రి ఈశ్వరన్ ఆనందం అంతా ఇంతా కాదు.

 

ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

 

‘3 దశలలో ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించామని, అమరావతిని ప్రజారాజధానిగా మార్చడంలో  సీయం చంద్రబాబు ఎంతో విజన్ కనబర్చారని తిరుగు ప్రశంసలందుకున్నారు.

 

‘మాపై మీకున్న నమ్మకాన్ని మరోసారి కనబరచినందుకు కృతజ్ఞతలు.ఈ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టి వీలయినంత త్వరగా ప్రాధమిక దశలన్ని పూర్తిచేసి కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. స్విస్ ఛాలెంజ్ లో ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్ కన్సార్టియం ఎంపిక కాగానే మా మంత్రిమండలి సమావేశంలో దానిని చర్చించాం. మా ప్రధానమంత్రి దీనికి పూర్తి మద్దతు ఇచ్చారు,’ అని ఈశ్వరన్ హర్షం వ్యక్తం చేశారు.

 

2018 ఆరంభంలో మా ప్రధాని భారత్ పర్యటనకు రానున్నారని. ఆ సమయంలో అమరావతిని సందర్శించే అవకాశం ఉందని కూడా ఈశ్వరన్ వెల్లడించారు. .

 

click me!