చంద్రబాబుకు ప్రజలే హైకమాండ్....ట

First Published Mar 20, 2017, 9:00 AM IST
Highlights

హై కమాండ్ ను కాదని అదే ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిళ్ళు పెట్టి చంద్రబాబు తన అభ్యర్ధులను ఎలా గెలిపించుకున్నారు.

‘తనకు ప్రజలే హై కమాండ్’ అసెంబ్లీ జరిగిన చర్చలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అన్న మాటలు. ప్రజలే హైకమాండ్ అన్న మాట నిజమే అయితే, స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీనే కదా గెలవాల్సింది? మరి టిడిపి ఎలా గెలిచింది? కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ రోజు కౌటింగ్ లో మూడు స్ధానాల్లోనూ టిడిపినే గెలిచింది. స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధల ఓట్లను తీసుకుంటే, మూడు జిల్లాల్లోనూ వైసీపీకే మెజారిటీ ఉంది. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. అంటే, ప్రజలు (హైకమాండ్)ఓట్లేసింది వైసీపీ అభ్యర్ధులకు.

 

మరి, హై కమాండ్ ను కాదని అదే ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిళ్ళు పెట్టి చంద్రబాబు తన అభ్యర్ధులను ఎలా గెలిపించుకున్నారు. అలాగే, పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన వారిలో 67మంది ఎంఎల్ఏలను హై కమాండ్ గెలిపించింది. మరి ప్రజా తీర్పును కాదని వారిలో 21 మంది ఎంఎల్ఏలను టిడిపిలోకి ఎలా లాక్కున్నారు చంద్రబాబు? హై కమాండ్ టిడిపిలోకి వెళ్ళమని ఆ 21మంది ఎంఎలఏలకు చెప్పిందా? వినేవాడు ఏపిజనాలైతే చెప్పేవారు చంద్రబాబట. అలాగే ఉంది నిప్పు వారి మాటలు.

click me!