
కొద్ది రోజుల క్రితం ప్రధాని మంత్రి మోదీ మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదాకా ఒకటే మంత్రం జపించారు.
ఈ మంత్రంతో దేశంలోని అన్ని సమస్యలు పోతాయ్, రాష్ట్రాలు సుభిక్షవుతాయి. అవినీతి అనేది ఉండదు.
సాగరమధనం నుంచి అమృతం దొరికినట్లు, నోట్ల రద్దు నుంచి ఈ మంత్రం వారికి దొరికింది. ఆ మంత్రమే క్యాష్ లెస్.
ఇపుడు పైవాడు, కిందివాడు ఇద్దరు క్యాష్ లెస్ వొల్లెవేయడం మానేశారు.
ఆంధ్రప్రదేశ్ లో క్యాష్ లెస్ ప్రయోగం కోసం పౌరసరఫరా వ్యవస్థను ఎంచుకున్నారు. రేషన్ షాపులలో క్యాష్ లెస్ ప్రవేశపెట్టి మొత్తం పేదలెవరికి క్యాష్ అవసరం లేకుండాచేస్తామని ముఖ్యమంత్రి ఒక సైడు, ఆ శాఖ మంత్రి పరిటాల సునీత మరొక సైడు బుకాయించారు.
పేద మహిళలంటే చంద్రబాబు నాయుడికి చాలా ప్రేమ. ప్రతి ప్రయోగానికి వాళ్లనే వాడుకుంటాడు.
ఇపుడేమయింది. క్యాష్ లెస్ హుష్ కాకి...కాకెత్తుకు పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదంతా ప్రారంభోత్సవాల శూరత్వం. ప్రారంభం కలర్ ఫుల్ గా సాగుతుంది అమరావతి శంకుస్థాపన లాగా. తర్వాత అంతే సంగతులు.
ఈ చౌకదుకాణాలలో జరిగిన క్యాష్ లెస్ బిజినెస్ ఎంతో తెలుసా... 11.57 శాతమే.
రేషన్ సరకుల పంపిణీలో క్యాష్‌లెస్ రాష్ట్ర వ్యాప్తంగా 11.57 శాతం మాత్రమే ఆ విధానం అమలైందంటే ఆయన శూరత్వం ఏమిటో తెలుస్తుంది.
క్యాష్ లెస్ లా సాగుతున్నదో చూద్దామని పౌర సరఫరాల శాఖ రెండ్రోజుల కిందట ఒక వర్కషాఫు వర్క్‌షాపు నిర్వహించింది. మంత్రి సునీత కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే 67.28 శాతం క్యాష్ లెస్ అమలయింది. మరొక ఆరు జిల్లాల్లో రేషన్ పంపిణీలో కనీసం ఐదు శాతం నగదు రహిత లావాదేవీలు కూడా దాటలేదు.
ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులో జరిగిన క్యాష్ లెస్ 4.27 శాతమే. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ కె.ఇ కృష్ణమూర్తి గారి కర్నూలు జిల్లాలో మరీ ఘోరంగా 0.89 శాతం మే జరిగింది. ఇక మంత్రి సునీత సొంత జిల్లాలో కూడా అంతంత మాత్రమే..జ 4.02 శాతం.
ఇదీ జిల్లాల వారీగా ఫిబ్రవరి క్యాష్ లెష్ బిజినెస్
1. కృష్ణా 67.28
2. పశ్చిమ గోదావరి 22.19
3. తూర్పు గోదావరి 15.54
4. విశాఖపట్నం 12.28
5. శ్రీకాకుళం 9.77
6. విజయనగరం 5.31
7. ప్రకాశం 5.11
8. గుంటూరు 4.68
9. చిత్తూరు 4.27
10. అనంతపురం 4.02
11. కడప 2.29
12. నెల్లూరు 1.90
13. కర్నూలు 0.89
ఈ తప్పు నాదికాదు,అధికారులదే అంటారేమో చూడాలి. ఎందుకంటే ఆయన రోజు 36 గంటల పనిలో బిజీ గా ఉన్నందున ఈ చిన్న విషయం మర్చిపోయారు.