
బ్రహ్మచారుల ఇంట కూడా త్వరలో దీపం వెలగనున్నది. ‘దీపం’ పథకం క్రింద ప్రభుత్వం మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే కదా. త్వరలో ఈ పథకాన్ని మహిళలతో పాటు పురుషులకు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒంటరిగా జీవిస్తున్న పురుషులను గుర్తించి వారికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం గ్యాస్ డీలర్లను ఆదేశించింది. రేషన్ కార్డులోని వివరాల ఆధారంగా ఒంటరి పురుషులను గుర్తిస్తారు. ఒకవైపేమో మంజూరవుతున్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంకోవైపేమో లబ్దిదారుల సంఖ్య తక్కువగా ఉంది. దాంతో ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవటం కష్టంగా ఉంది. అందుకనే ఒంటరి పురుషుల ఇళ్ళల్లో కూడా దీపాన్ని వెలిగించాలని ప్రభుత్వం నిర్నయించింది.