ఇకనుండి ఎవరి సర్వేలు వారే చేయించుకోవాలట

Published : May 20, 2017, 11:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఇకనుండి ఎవరి సర్వేలు వారే చేయించుకోవాలట

సారాంశం

ఇక నుండి ఎవరి పనితీరుపై వారే సర్వేలు చేయించుకుని నివేదికలు తనకు అందచేయాలని స్పష్టం చేసారు. ఆ నివేదికలను తన వద్దున్న నివేదికలతో సరిపోల్చుకుంటానని కూడా చెప్పారు. తాను  చేయిస్తున్న సర్వేల ఫలితాలపై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు కూడా చంద్రబాబే చెప్పారు.

ఇక నుండి తెలుగుదేశంపార్టీలో నేతలు ఎవరికి వారే సర్వేలు చేయించుకోవాలట. తాజాగా చంద్రబాబునాయుడు చెబుతున్న మాట అదే. ఇప్పటి వరకూ ప్రజాప్రతినిధులు, నేతల పనితీరుపై చంద్రబాబే సర్వ చేయించేవారు కదా? ఆ సర్వే వివరాలను వినిపించినపుడు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తాము కష్టపడి పనిచేస్తున్న సర్వేల్లో తమపై నెగిటివ్ గా రావటాన్ని అంగీకరించలేకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు.

చిత్తూరు జిల్లాలో పర్యటించే నిమ్మితం కుటుంబసమేతంగా చంద్రబాబు శుక్రవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. వెంటనే పుత్తూరులోకి ఓ కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సుమారు 12 గంటల తర్వాత తిరుపతిలోని పద్మావతి అతిధిగృహానికి చేరుకున్నారు. అప్పుడు పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రధానంగా రెండు అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు డబ్బులు పార్టీ అకౌంట్ కు జమకాకపోవటం, నేతల పనితీరు.

పార్టీ సభ్యత్వ నమోదు డబ్బులు గురించి మాట్లాడుతూ, నేతలు చేయిస్తున్న సభ్యత్వ నమోదు డబ్బులు పార్టీ అకౌంట్ కు ఎందుకు జమ చేయలేదని అడిగారు. జిల్లా నుండి సుమారు కోటి రూపాయలకు పైగా ఇంకా జమకాలేదట. వెంటనే అందరూ తెచ్చి జమ చేయమని ఆదేశించారట. తర్వాత పనితీరు గురించి మాట్లాడుతూ, ఇక నుండి ఎవరి పనితీరుపై వారే సర్వేలు చేయించుకుని నివేదికలు తనకు అందచేయాలని స్పష్టం చేసారు.

ఆ నివేదికలను తన వద్దున్న నివేదికలతో సరిపోల్చుకుంటానని కూడా చెప్పారు. తాను  చేయిస్తున్న సర్వేల ఫలితాలపై చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు కూడా చంద్రబాబే చెప్పారు. అదే విషయమై మాట్లాడుతూ, ‘ తాను సర్వేలు చేయించటం, నేతలు అసంతృప్తి వ్యక్తం చేయించటం తనకు ఇబ్బందిగా మరుతోంద’న్నారు.

ముఖ్యమంత్రికి జిల్లాకు వస్తుండటంతో ఎప్పటి నుండో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు ఆ విషయాన్ని ప్రస్తావిద్దామనుకున్నారు. అయితే, వారికెవరికీ చంద్రబాబు ఎటువంటి అవకాశం ఇవ్వకపోవటంతో అందరిలోనూ అసంతృప్తి కనబడుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంత వరకూ పదవులు భర్తీ చేయకుండా ఉంచటపై ఎప్పటి నుండో నేతల్లో మంటగా ఉంది. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకనే నేతలెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడేసి పంపేసారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu