
ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మంది సంతానాన్ని కనాలట..లేకపోతే.. ఏపీ పరిస్థితి కూడా జపాన్ దేశంలాగానే తయారౌతుతందట. ఈ మాటలు చెబుతుంది ఎవరో కాదు.. స్వయానా సీఎం చంద్రబాబు .
జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో దేశంలో జనాభాను అదుపు చేసేందుకు అప్పటి ప్రభుత్వాలు చాలానే నియమ నిబంధనలు పెట్టాయి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని చెప్పేవారు. ఇప్పటికీ అదే నియమాన్ని ప్రజలు పాటిస్తూ వస్తున్నారు.అయితే.. తాజాగా.. ప్రతి ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
జపాన్ దేశంలో యువకులు లేక దేశం సంక్షోభంలో పడిపోయింది. ఆ దేశంలోని ప్రజలు ప్రతి అవసరానికి టెక్నాలజీపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా జపాన్ లో ‘ జనాభా సంక్షోభం’ తలెత్తింది. ఆ సంక్షోభం మనదగ్గర రిపీట్ కాకూడదని పిల్లల్ని కనాలని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు.
గురువారం విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన కుటుంబ వ్యవస్థను అందరూ కాపాడాలని సూచించారు. ఒకప్పుడు ఎక్కువ జనాభా వద్దని తానే చెప్పానని.. ప్రస్తుతం మారుతున్న అవరసారలను బట్టి తానే పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. జనాభా తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ కూడా జపాన్‌లా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఇప్పటికే జనాభా పెరిగిపోయి పలు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. సంక్షేమ పథకాలు అందరికీ అందించలేక ప్రభుత్వాలు.. అందక పేదలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ పది పది మంది పిల్లల్ని కంటే పరిస్థితి ఇంకెలా తయారౌతుందో?