దుబారా ఖర్చులకు కళ్ళెం వేయాలట....

Published : Jul 14, 2017, 10:09 AM ISTUpdated : Mar 24, 2018, 12:14 PM IST
దుబారా ఖర్చులకు కళ్ళెం వేయాలట....

సారాంశం

అసలు వెనకాముందూ చూసుకోకుండా ఖర్చులు చేస్తున్నదే చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పొదుపు పాటించారా అంటే అదీ లేదు. ఎక్కడికైనా ప్రత్యేక విమానాలే.  అంతెందుకు వెలగపూడిలోని సచివాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలోని కరకట్టమీదున్న క్యాంపు కార్యాలయానికి వెళ్ళాలన్నా హెలికాప్టరే.

‘ఖర్చులకు కళ్ళెం వేయండి...ఖర్చుల విషయంలో ప్రభుత్వ శాఖలు ఆచితూచి వ్యవహరించాలి’..చంద్రబాబునాయుడు చేసిన సూచనిది. గురువారం ఆర్ధికశాఖ ముఖ్య అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ప్రభుత్వ ఆదాయ-వ్యయాలపై చర్చించారు. తొలి మూడు నెలల్లోనే ప్రభుత్వం ఆదాయానికి మించి ఏకంగా రూ. 2485 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు.

దాంతో చంద్రబాబు వారిపై అసంతృప్తి వ్యక్తం చేసారట. ఖర్చులకు కళ్ళెం వేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని క్లాస్ తీసుకున్నారట. ఖర్చుల విషయంలో శాఖలు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరాన్ని చంద్రబాబు అధికారులకు గుర్తు చేసారట. అప్పటికి ఖర్చుల విషయంలో ఆయనేదో చాలా పొదుపు పాటిస్తున్నట్లు బిల్డప్.

అసలు వెనకాముందూ చూసుకోకుండా ఖర్చులు చేస్తున్నదే చంద్రబాబు. పోయిన ఎన్నికల్లో అధికారం కోసం ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సిఎం పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలిసిందే. పోని అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పొదుపు పాటించారా అంటే అదీ లేదు. ఎక్కడికైనా ప్రత్యేక విమానాలే, అంతెందుకు వెలగపూడిలోని సచివాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలోని కరకట్టమీదున్న క్యాంపు కార్యాలయానికి వెళ్ళాలన్నా హెలికాప్టరే.

హైదరాబాద్ లోని సచివాలయానికి కోట్లు ఖర్చు పెట్టి వాస్తు మార్పలు  చేయించారు. పట్టుమని తొమ్మిది నెలలు కూడా ఉండకుండా హటాత్తుగా విజయవాడకు మారిపోయారు. అదే విధంగా క్యాంపు కార్యాలయం పేరుతో అతిధి భనవాలకు ఖర్చులు, సొంత ఇంటికి భద్రత పేరుతో ఖర్చులు, అద్దె ఇంట్లోకి మారినపుడు మళ్లీ భద్రతా ఖర్చులు, విజయవాడకు మారినపుడు క్యాంపు కార్యాలయనికి షోకులు, భద్రతా  ఖర్చులు. ఇలా..ఎక్కడ బడితే అక్కడ వందల కోట్ల రూపాయలు వృధా ఖర్చులు చేస్తున్నారు.

ఇక ఏదో ఓ పేరుతో శంకుస్ధాపనలు, ప్రారభోత్సవాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం పేరుతో వందల కోట్లు ఖర్చు చేసారు. తొలి మూడు మాసాల్లో రాబడి రూ. 32978 కోట్లు. చేసిన ఖర్చు రూ. 35,463 కోట్లు. అంటే రూ. 2,485 కోట్లు భారం. జలవనరుల శాఖ ఖర్చే రూ. 4,435 కోట్లుంది. మాధ్యమిక విద్యాశాఖకు రూ. 4,925 కోట్లు ఖర్చు. ఇష్టారాజ్యంగా ఖర్చులు చేస్తున్నది చంద్రబాబే. కానీ క్లాసులు పీకించుకుంటున్నదేమో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu