టిడిపికి ఓట్లేస్తేనే నంద్యాలలో అభివృద్ధి

Published : Jul 13, 2017, 07:20 PM ISTUpdated : Mar 24, 2018, 12:06 PM IST
టిడిపికి ఓట్లేస్తేనే నంద్యాలలో అభివృద్ధి

సారాంశం

ఎన్నికల సభలో లోకేష్ మాటలు విన్నవాళ్ళందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓట్లడిగే విధానం ఇదేనా అంటూ టిడిపి నేతలే నిర్ఘాంతపోతున్నారు. టిడిపి అభ్యర్ధికి ప్రచారంలో ఎక్కడైనా మైనస్ ఉంటే దాన్ని భర్తీ చేయాల్సిందిపోయి తండ్రి, కొడుకులే పెద్ద మైనస్ గా మారుతున్నారేమో అన్న అనుమానాలు సర్వత్రా మొదలైంది.

మంత్రి నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారు. బెదిరంపుల్లో చంద్రబాబునాయుడునే మించిపోతున్నాడు. ‘నేనిచ్చిన రేషన్ తీసుకుంటూ, పింఛన్ తీసుకుంటూ మాకు ఓటెయ్యరా’ అంటూ నంద్యాలలో జనాలను చంద్రబాబు ఆయధ్య నిలదీసిన సంగతి అందరికీ గుర్తుంది కదా? ఆ మాటలను జనాలను మరచిపోకముందే లోకేష్ కూడా తాజాగా నంద్యాల జనాలను బెదిరించారు. టిడిపికి ఓటేయకపోతే అభివృద్ధి జరగదట.

 

నంద్యాల ఉపఎన్నికలో జనాలు టిడిపినే గెలిపించాలట. లేకపోతే అభివృద్ధి మొత్తం ఆగిపోతుందన్న అర్ధంవచ్చేట్లుగా బెదిరించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పైగా లోకేష్ మాట్లాడింది కూడా నంద్యాల నియోజకవర్గంలో కీలకమైన గోస్సాడు మండల కేంద్రంలోనే కావడం గమనార్హం. జనాలను ఓట్లయమని అభ్యర్ధించాల్సిన లోకేష్ బెదిరించటమేంటో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు. ఉపఎన్నిక వచ్చింది కాబట్టే నంద్యాలపై చంద్రబాబు దృష్టి పెట్టారనే ఆరోపణలకు లోకేష్ తాజా వ్యాఖ్యలు ఊతమిస్తోంది.

 

ఎన్నికల సభలో లోకేష్ మాటలు విన్నవాళ్ళందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓట్లడిగే విధానం ఇదేనా అంటూ టిడిపి నేతలే నిర్ఘాంతపోతున్నారు. టిడిపి అభ్యర్ధికి ప్రచారంలో ఎక్కడైనా మైనస్ ఉంటే దాన్ని భర్తీ చేయాల్సిందిపోయి తండ్రి, కొడుకులే పెద్ద మైనస్ గా మారుతున్నారేమో అన్న అనుమానాలు సర్వత్రా మొదలైంది. పనిలో పనిగా నంద్యాలలో తమ అభ్యర్ధికి అత్యదిక మెజారిటీ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేసారు లేండి. బహిరంగ సభల్లో జనాలను బెదిరిస్తే అభ్యర్ధికి అత్యధిక మెజారిటీ సంగతి  దేవుడెరుగు అసలు ఓట్లు పడతాయా అన్నదే అర్ధం కావటం లేదు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్