
అన్ని సమస్యలకు అరటి పండు వొలిచినంత ఈజీగా పరిష్కారాలు చెప్పే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతుబట్టని విషయాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఆయన్ని రెండు ప్రశ్నలు పీడిస్తావున్నాయి. అవేంటంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నాళ్లు బయటు ఉంటాడు ?ఆయన మీద ఉన్న కేసుల్లో జైలుకెళ్లేదెపుడు?
బాబు కార్యశూరుడు. అనుకున్నది సాధిస్తాడు. ఇపుడాయన జగన్ జైలుకెళ్లాలని భావిస్తున్నాడు. అయినా జగన్ కు శిక్ష పడటం లేదు. జైలు కెళ్లడం లేదు.దీనితో కేంద్రంలోనే ఎవరో జగన్ కు సహాయం చేస్తున్నారనే అనుమానం వచ్చింది. , అందువల్లే విచారణ పూర్తికావడం లేదు, జగన్ కు జైలు కెళ్లడం లేదని ఆయన భావిస్తున్నాడు.
దీని అంతుచూడాలనుకుంటున్నారు. ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టోరేట్ , సిబిఐ లు తొందరగా విచారణ పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయకుండా కేంద్రంలో ఏవరో చక్రం తిప్పిఅడ్డుకుంటున్నందునే విచారణ నత్త నడకన సాగుతున్నదని ఆయన అనుమానం. కాబట్టిఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టోరేట్ , సిబిఐ ల మీద కేంద్రానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. లెక్క లేనన్ని అక్రమార్జన కేసులున్నా ఇంకా విచారణ పూర్తికాకపోవడమేమటి, జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడకపోవడమేమిటి అనేవి టిడిపి అధ్యక్షునికి చీకాకుకల్గిస్తున్న ప్రశ్నలు.
ఎపుడో 2011లో జగన్ మీద కేసులు పెట్టారు. అయినా విచారణ పూర్తి కావడం లేదు. ఎందుకింత జాప్యం చేస్తున్నారో తనకు తెలియాల్సిందే నంటున్నారాయన.
వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమే అని కొన్ని సర్వేలు స్పష్టంగా చెబుతున్నా జగన్ గురించి ఆయన అంతలోతుగా ఆలోచించడమెందుకు? లేక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ చేయించకున్న సర్వే ల గురించి బాబు భయపడుతున్నాడా ?