కాకినాడలో కూడా నంద్యాల ఫార్ములానే

Published : Aug 23, 2017, 07:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కాకినాడలో కూడా నంద్యాల ఫార్ములానే

సారాంశం

కాకినాడలో కూడా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను, ఎంపిలను రంగంలోకి దింపుతున్నారు. వీరికి అదనంగా జిల్లా మంత్రులతో పాటు ఇతర నేతలు ఎటూ ఉంటారు కదా? ఇంతమందిని రంగంలోకి దింపటం ద్వారా చంద్రబాబు జనాలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో? ఇక్కడ కూడా నంద్యాలకు లాగానే సామాజికవర్గాలవారీగా మంత్రులు తదితరులను దింపుతున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో అమలు చేసిన ఫార్ములానే కాకినాడలో కూడా అమలుచేసేందుకు చంద్రబాబునాయుడు రంగం సిద్ధం చేసారు. నంద్యాలలో ప్రతీ మండలానికి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జిలుగా నియమించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగైదు వార్డులకు ఓ ఎంఎల్ఏని నియమించారు. హోలు మొత్తం మీద దాదాపు 12 మంది మంత్రులతో పాటు 30 మంది ఎంఎల్ఏలు, ఐదుగురు ఎంఎల్సీలనే కాకుండా పలువురు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి నానా హడావుడీ చేసిన సంగతి అందరూ చూసిందే.

అదేపద్దతిలో కాకినాడలో కూడా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను, ఎంపిలను రంగంలోకి దింపుతున్నారు. వీరికి అదనంగా జిల్లా మంత్రులతో పాటు ఇతర నేతలు ఎటూ ఉంటారు కదా? ఇంతమందిని రంగంలోకి దింపటం ద్వారా చంద్రబాబు జనాలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో? ఇక్కడ కూడా నంద్యాలకు లాగానే సామాజికవర్గాలవారీగా మంత్రులు తదితరులను దింపుతున్నారు. ఇప్పటికే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు రంగంలోకి దిగేసారు.

మొదట్లో నంద్యాలలో కూడా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిని ఈజీగా తొక్కేయచ్చనుకున్నది టిడిపి. కానీ ఎప్పుడైతే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారో సీన్ మొత్తం మారిపోయింది. దానికితోడు జగన్ ఏకంగా 13 రోజులు క్యాంపు వేయటంతో టిడిపికి చెమటలు పట్టేసాయి. దాంతో చంద్రబాబుతో సహా పార్టీ మొత్తం జగన్ చుట్టూనే తిరిగిన సంగతి అందరూ చూసిందే. ఈసారి కాకినాడలో ఏమి జరుగుతుందో చూడాలి. నంద్యాలలో జరిగినట్లే కాకినాడలో కూడా సామాజికవర్గాల వారీగా సమావేశాలు, బేరాలు మొదలుపెట్టేసారు టిడిపి నేతలు.

ఎంత చేసినా గెలుపుపై టిడిపికి ఇంకా అనుమానమే. అందుకనే మంగళవారం కాకినాడలో నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మట్లాడుతూ, ఏ చిన్న అంశాన్నీ తేలిగ్గా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. చంద్రబాబులో ఆందోళనేంటంటే జగన్+‘కాపు ఫ్యాక్టర్’ ఎలా పనిచేస్తుందో అన్నఅనుమానం. జగన్ కాకినాడలో కూడా రోడ్డుషోలు, ఇంటింటి ప్రచారం చేయనున్నారు. సరే ఇక్కడ కాపులు ఇప్పటికే చంద్రబాబుపై మండుతున్నారు. దానికితోడు కాపులందరూ టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ ఇప్పటికే పిలుపినిచ్చారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి?  

PREV
click me!

Recommended Stories

LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu
తందనానా–2025’ విజేతలకు సీఎం చంద్రబాబు బంగారు పతకాలు | Indian Cultural Heritage | Asianet News Telugu