ఎమ్మెల్సీ వాకాటి పార్టీ నుంచి సస్పెన్షన్ : చంద్రబాబు

First Published May 13, 2017, 1:30 PM IST
Highlights

బ్యాంకులకు దొంగ డాక్యుమెంట్లు సమర్పించి, కోట్ల రుపాయల లోన్లు తీసుకుని ఎగ్గొట్టి ఎమ్మెల్సీ అయిన వాకాటి నారాయణ రెడ్డిని టిడిపిని నుంచి సస్పెండ్ చేశారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రటించారు. వాకాటి ఇంటిమీద సిబిఐ దాడుల జరిగినందున సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దాడుల వ్య వహారం తేలాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

బ్యాంకులకు దొంగ డాక్యుమెంట్లు సమర్పించి, కోట్ల రుపాయల లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన ఎమ్మెల్సీ వాకాటినారాయణ రెడ్డిని టిడిపిని నుంచి సస్పెండ్ చేశారు.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రటించారు. వాకాటి ఇంటిమీద సిబిఐ దాడుల జరిగినందున సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దాడుల వ్యవహారం తేలాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

సిబిఐ దాడులు

శుక్రవారం నాడు సిబిఐ అధికారులు ఆయన ఇళ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. నెల్లూరు  వేదాయపాళెంలోని ఆయన నివాసానికి ఉదయమే పదిమంది సిబిఐ అధికారుల బృందం వచ్చింది.

ఆ సమయంలో వాకాటి నారాయణరెడ్డి తన అనుచరులతో మాట్లాడుతూ ఇంట్లోనే ఉన్నారు. వచ్చీరాగానే అధికారులు సోదాలు ప్రారంభించారు. పలు కీలక పత్రా లను స్వాధీనం చేసుకున్నారు.

 

బెంగళూరు, హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లపై కూడా ఏక కాలంలో దాడులు చేసినట్టు సమచారం. దాడుల వివరాలు తెలుసు కునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై వాకాటి అనుచరులు దాడికి పాల్ప డ్డారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.

 

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు వాకాటిని ప్రశ్నించారు.

 

ఆయన విఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా పేరుతో బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నారు. తక్కువ విలువున్న ఆస్తులను ఎక్కువగా చూపి సుమారు రూ.450 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిసింది. సకాలంలో చెల్లించక పోవడంతో బ్యాంకులు ఆయనకు నోటీసులు జారీ చేశాయి.  వెంటనే ఆయన కోర్టును ఆశ్రయించారు. తప్పుడు పత్రాలు సృష్టించి రుణం తీసుకున్నారని బ్యాంకులు గుర్తించాయి. సుమా రు రూ. 203 కోట్ల మేర బ్యాంకులు నష్టపోయినట్టు సమాచారం.

 

ఉదయం 10 .30 గంటలకు ఎమ్మెల్సీ ఇంటికి వచ్చిన అధికారులు తొలుత ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకు న్నారు. ఇంట్లో అణువణువూ తనిఖీ చేశారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇంట సోదాలు సాగడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

 

 

 

click me!