
సొంత మంత్రులపైనే చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. హాజరైన మంత్రులందరి వద్ద నుండి వారి మొబైల్ ఫోన్లను సెక్యూరిటీ సిబ్బంది తీసేసుకున్నారు.
ఈ విధంగా గతంలో ఎన్నడూ జరగలేదు. మరి, ఇపుడే ఎందుకు జరిగిందంటే మంత్రుల్లో ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నయోమే అని అనుకుంటున్నారు.
క్యాబినెట సమావేశంలో జరిగే చర్చలను మంత్రులెవరైనా లైవ్ టెలికాస్ట్ చేస్తారని సిఎం అనుమానిస్తున్నారేమో తెలీదు. అందుకనే మంత్రుల సెల్ ఫోన్లను సమావేశ మందిరం బయటే తీసేసుకున్నారు.
దేశంలోని ఇంకే రాష్ట్రంలోనైనా ఈ విధానం ఉందా అని మంత్రులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి తన సహచరులపైన తనకేమాత్రం నమ్మకం లేదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లైంది.