జగన్ ఆర్థిక ఉగ్రవాది : హూంకరించిన చంద్రబాబు

First Published Mar 30, 2017, 8:29 AM IST
Highlights

‘ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. లేకపోతే, ఆర్థిక ఉగ్రవాదిగాపోలీసుల చేతిలో ఉండేవాడు.’

నెల్లూరు జిల్లాలో జరిగిన టెన్త్ పేపర్ లీకే సాక్షి పేపర్ చేపట్టిన స్టింగ్ ఆరేషన్ అని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు.

 

ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా విజయ్ మాల్యా తరహా ఆర్థిక ఉగ్రవాది అని  వర్ణించారు.పేపర్ లీకేజ్ మీద తీవంగ్రా స్పందిస్తూ ఈ వ్యాఖ్యాచేశారు. విజయ్ మాల్యాకు జగన్మోహన్ రెడ్డికి తేడాలేదని  ఇద్దరు అర్ధిక నేరస్థులే అని అన్నారు.

 

‘ఆయనప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి నేను సమాధానంచెప్పాల్సి వస్తుంది. లేకపోతే, ఆర్థిక ఉగ్రవాదిగాపోలీసలు చేతిలోఉండేవాడు,’ అని ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.

 

అసలు పేపర్ లీకేజీ విషయంలో  దర్యాప్తు జరగాల్సింది సాక్షి కోణం నుంచి అని ఆయన చెప్పారు. ఇందులో సాక్షి విలేకరి పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్ష పార్టీకి నిజాయితీ ఉంటే,పేపర్ లీకయినట్లు వారికి ఏ ఫోన్ నుంచి కాల్ వచ్చిందో  వివరాలందించి దర్యాప్తు చేయాలని అడగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

‘ ఇలా జరుగనుందున నాకు సాక్షి మీద అనుమానం వస్తున్నది. ఈ అనుమానం భయపడుతున్నది. సాక్షి రిపోర్టర్ అమర్ ఎవరు. ఆయన ఫోన్ మాకు ఇవ్వండి. పత్రికల పేరుతో పనికిమాలిన పనులు చేయండి. సాక్షి దోషయితే శిక్షిస్తాం. మంత్రి నారాయణను శిక్షిస్తాం. నారాయణ కాలేజీల యాజమాన్యాన్ని శిక్షిస్తాం,’ అని ముఖ్యమంత్రి హచ్చరించారు.

 

తాను ఛండశాసననిడని చెబుతూ ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. లీకేజీ లో ఎంతమంది మీద చర్య తీసుకున్నది కూడా ముఖ్యమంత్రి వివరించారు.

సాక్షి రిపోర్టరా, స్టింగ్ అపరేటరా...  అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  ఇదే నిజమయితే సాక్షిని కూడా వదలి పెట్టం.  ఇది లేకేజీ  కాదు,కాదు.. కాదు. అని మూడుసార్లు నొక్కి చెప్పారు.

విలేకరికి సాక్షి రిపోర్టర్ సపోర్టు చేస్తాడని జగన్మోహన్ రెడ్డిగారు ముందుకు రావాలి లేదా సిబిఐ విచారణ పేరుతోపారిపోండి... అని అన్నారు.

 

విజిల్ బ్లోయర్ అయిన సాక్షి విలేకరిని నిందలు మోపడాన్ని ప్రతిపక్షనేత జగన్ ఖండించాడు.

 

click me!