సహారా డైరీల్లో చంద్రబాబు

Published : Jan 12, 2017, 02:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
సహారా డైరీల్లో చంద్రబాబు

సారాంశం

సహారా డైరీల్లో చంద్రబాబు పేరు

చంద్రబాబుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మరో బాంబు పేల్చారు. సహారా డైరీల్లో చంద్రబాబు పేరు కుడా ఉందని గురువారం సుప్రింకోర్టులో వెల్లడించారు. గతంలో తన ప్రచారం కోసం చంద్రబాబు 25 మంది జర్నలిస్టులకు అధికారికంగా రూ. 51 వేలు లంచం ఇస్తున్నట్లు ట్వట్టర్ లో ప్రకటించి సిఎంను బ్బందులో పడేసిన సంగతి తెలిసిందే.

 

అదే ప్రశాంత్ తాజాగా సహారా డైరీల్లో చంద్రబాబు పేరుందని చెప్పటం మరో సంచలనంగా మారింది. సహారా డైరీల్లో ఉన్న రాజకీయ నేతల పేర్లను ప్రశాంత్ చదవి వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి పేరు గుజ్ సిఎం, మోడిజీ అని ఉందన్నారు.

 

అదేవిధంగా సుష్మా స్వరాజ్, చంద్రబాబుజీ, ములాయం సింగ్, మాయావతి, ప్రమోద్ మహాజన్ కుమార్తె, శివ్ రాజ్ థాకరే, రాజస్ధాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, అద్వానీ, రవిశంకర్, షిండే, ఫరూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే, దిగ్విజయ్ సింగ్ తదితరుల పేర్ల చదివి వినిపించటం సంచలనంగా మారింది. దాదా పేరును నాలుగుసార్లు ఉంది కానీ ఆ పేరు ఎవరిదో అర్ధం కావటం లేదన్నారు.

PREV
click me!

Recommended Stories

Pemmasani: గుంటూరు నగరానికి మహర్దశ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని| Asianet Telugu
CM Chandrababu Naidu: మే డే సందర్బంగా కార్మికులకు5 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం | Asianet News Telugu