
విజయవాడ: మరికొద్దిసేపట్లో భాజపా అధ్యక్షుడు అమిత్‌షాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విందు ఇవ్వనున్నారు. దీనికోసం చంద్రబాబు ఇప్పటికే కలెక్టర్ల సదస్సు నుంచి నివాసానికి బయల్దేరారు. ఈ విందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్‌ప్రభు, సుజనా చౌదరీ తదతరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
ఇది చాలా కీలకమయిన సమావేశమని భావిస్తున్నారు. బిజెపి టిడిపి మధ్య నెలకొన్న ఒక టెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చకు వస్తుందని భావిస్తున్నారు.
బిజెపితో పొత్తు ఉండాలన్నదే తాము కోరుతున్నామని, దేశానికి మోదీ నాయకత్వం అవసరమని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతారట.
అలాగే బిజెపిలో తెలుగుదేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్నా లక్ష్మి నారాయణ,పురందేశ్వరి, సోెము వీర్రాజు వంటి వారి నోరు మూయించాలని కూడా ఆయన కోరతారట.
భారతీయ జనతా పార్టీని బలపర్చుకోవడం పేరుతో రాష్ట్రంలో బిజెపి-టిడిపి ల మధ్య ఉద్రికత్త నెలకొనకుండా చూసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇపుడు అమిత్ షా తెలంగాణా పర్యటన రాజకీయ వివాదమయింది. అమిత్ షా లెక్కలన్నీ చెప్పి, కేంద్రనిధులేమయ్యాయని అడిగారు. అలా ఆంధ్రలో మాట్లాడకుండా ఉండేలా అమిత్ షాను మచ్చిక చేసుకునేందుకే ఈ విందు అనిచెబుతున్నారు. ఆయనకు కేంద్రమంత్రులు సుజనా చౌదరి, వెంకయ్యనాయుడు లు మద్దతునిస్తారని అంటున్నారు.