ఇక జనాభా పెంచండంటున్న బాబు

Published : Dec 27, 2016, 10:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఇక జనాభా పెంచండంటున్న బాబు

సారాంశం

చిన్న కుటుంబాలు చాలు,  జనాభా పెంచండంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

 

చిన్న కుటుంబం చింతలు లేని కుంటుంబం కాదు... అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు.

 

చిన్న చిన్నకుటుంబాలయిపోయి, చివరకు కుటంబాలే లేకుండాపోయేపరిస్థితివస్తుందని ఆయన  తెగఫీలయిపోతున్నారు.

 

ఆ మధ్య ఆయన జపాన్ వెళ్లి  ప్రధాని  షింజో అబే ని కలసి వచ్చినప్పటినుంచి ఆయన జనాభా పెంచడం గురించి తెగ మదన పడిపోతున్నారు. 

 

అందువల్ల ఇక తగ్గించిందిచాలు, పిల్లలను ఎక్కువ మందిని కనాలని సలహా ఇస్తున్నారు.

 

 ఈ రోజు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతున్న ఎకనమిక్ కాన్ఫరెన్స్ లో ఆయన చేసిన ప్రసంగంలో ఈ అంశమే.

 

ఇంతవరకు ప్రపంచంలో దేశాలన్నీ కూడా జనాభా తగ్గించేందుకు పోటీ పడ్డాయి. మనమూ కూడా పోటీలో ఉన్నాం. జనాభా బాగా తగ్గిపోయింది. ఇలా జరుగుతూ పోతే, ఈ సాంకేతికాభివృద్దిని అనుభవించేందుకు జనమే లేకుండా పోతారని ఆయన ఎపుడో సెలవిచ్చారు. 

 

అందువల్ల జనాభా పెంచేందుకు కృషి జరగాలి.

 

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంచేందుకు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థిక వేత్తలకు వివరించారు.

 

నిన్ననే ఎక్కడో మాట్లాడుతూ వాసుదేవానంద సరస్వతి ప్రతి హిందూ కుటుంబం కనీసం పది మందిని కనాలని హితవుచేశారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది కూడా చిన్న కుటుంబమో. ఆయనకు ఈ  చిన్న కుటుంబమే పెద్ద చింత అయి కూర్చున్నట్లుంది. 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?