దాడి రేవంత్ పైనే...కానీ నొప్పి మాత్రం చంద్రబాబుకే

Published : Nov 08, 2017, 10:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
దాడి రేవంత్ పైనే...కానీ నొప్పి మాత్రం చంద్రబాబుకే

సారాంశం

తెలంగాణా టిడిపి నుండి రేవంత్ రెడ్డి నిష్క్రమణతో రాజకీయంగా రెండు రాష్ట్రాల్లోనూ విచిత్రమైన పరిస్ధితులు నెలకొన్నాయి.

తెలంగాణా టిడిపి నుండి రేవంత్ రెడ్డి నిష్క్రమణతో రాజకీయంగా రెండు రాష్ట్రాల్లోనూ విచిత్రమైన పరిస్ధితులు నెలకొన్నాయి. ఎప్పుడైతే రేవంత్ టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారో అప్పటి నుండి ‘ఓటుకునోటు’ వ్యవహారం మళ్ళీ పదే పదే తెరపైకి వస్తోంది. ఇంకా విచిత్రమేమిటంటే టిఆర్ఎస్ నేరుగా రేవంత్ ‘ఓటుకునోటులో దొరికిన దొంగ’ అని అంటూంటే, దాని ప్రభావం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పడుతోంది. అంటే దెబ్బ పడుతోంది రేవంత్ రెడ్డిపైన అయితే, నొప్పి మాత్రం చంద్రబాబుకు అన్నమాట.

టిఆర్ఎస్-రేవంత్ మధ్య యవ్వారం కాస్తా ముదిరితే ఓటుకునోటు కేసులో ఇబ్బంది పడేది మళ్ళీ చంద్రబాబే అన్న విషయ అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఓటుకునోటు కేసులో రేవంత్ కేవలం పాత్రదారి మాత్రమే. అసలు సూత్రదారి చంద్రబాబే అని ఎవరినడిగినా చెబుతారు.  వచ్చే ఎన్నికల్లో టిడిపి-టిఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలన్న కొందరి టిడిపి నేతల అత్యుత్సాహమే చివరకు చంద్రబాబు కొంపముంచుతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అందుకనే టిఆర్ఎస్-రేవంత్ వ్యవహారాన్ని వీలైనంత లో ప్రొఫైల్లో ఉంచాలని టిడిపి భావిస్తోంది. అయితే, ఆ విషయాన్ని టిఆర్ఎస్ తో చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే, కెసిఆర్ ను గద్దె దింపటమే తన లక్ష్యంగా రేవంత్ ప్రకటించిన విషయం తెలసిందే. రేవంత్ తన టార్గెట్ ను ప్రకటించిన తర్వాత టిఆర్ఎస్ మాత్రం ఎందుకూరుకుంటుంది?

రేవంత్ ను ఇబ్బందులు పెట్టటానికి కెసిఆర్ కున్న ఏకైక ఆయుధం ఓటుకునోటు కేసు ఒకటే. ఉన్న ఒక్క ఆయుధాన్ని టిఆర్ఎస్ వదులుకుంటే రేవంత్ ను కట్టడి చేయటం టిఆర్ఎస్ తరం కాదు. అందుకనే పదే పదే అదే ఆయుధాన్ని టిఆర్ఎస్ ఉపయోగిస్తోంది. రేవంత్ మౌనంగా ఉన్నంత వరకే చంద్రబాబు సేఫ్. ఒకవేళ రేవంత్ కూడా టిఆర్ఎస్ పై ఎదురుదాడి మొదలుపెట్టాడంటే చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైనట్లే.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?