ఉద్యమంపై మళ్ళీ నీళ్ళు చల్లుతున్నారు

Published : Jan 24, 2017, 01:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఉద్యమంపై మళ్ళీ నీళ్ళు చల్లుతున్నారు

సారాంశం

ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో గొడవలు పెట్టుకోమంటారా అని ఎదురు ప్రశ్నించటం నిజంగా సిగ్గుపడాల్సిన అంశమే.  హక్కుల గురించి అడగటమంటే గొడవ పెట్టుకున్నట్లే అని చంద్రబాబు అనుకోవటమే విచిత్రం.

 

రాష్ట్రంలో టిడిపి వ్యవహారం ‘అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉంది. కేంద్రం ముందు తాను సాగిలపడింది చాలకుండా ప్రతిపక్షాలు కూడా సాగిలపడాలనుకుంటోంది. రాష్ట్రప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడే శక్తి లేదు. అలాగని పోరాటం చేసే వారిని వారి ఖర్మానికీ వదిలిపెట్టటం లేదు. అవకాశం ఉన్నన్ని అడ్డంకులు సృష్టిస్తోంది.  తాజాగా ప్రత్యేకహోదా ఉద్యమానికి మోకాలు అడ్డుతోంది. జల్లికట్టు స్పూర్తిని ఆదిలోనే తుంచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా చంద్రబాబునాయుడు ఆరంభిస్తే  తరువాత నేతలందుకున్నారు.

 

తమిళనాడు ప్రజలు జల్లికట్టుకు అనుమతి సాధించటం ఏపిలో కూడా స్పూర్తినిచ్చింది. దాంతో విశాఖపట్నంలో 26వ తేదీన ఆర్కె బీచ్ లో ప్రశాంతంగా ఉద్యమం మొదలుపెట్టాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలైంది. దానికితోడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకహోదా సాధనకు మద్దతు పలికారు.

 

దాంతో జనసేన, వైసీపీ, కాంగ్రెస్ అభిమానులు 26వ తేదీన విశాఖ ఉద్యమంలో పాల్గొంనేందుకు సిద్ధమయ్యారు. దాంతొ ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైంది. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ, జల్లికట్టుకు-ప్రత్యేకహోదాకు పోలిక ఏమిటో అర్ధం కావటం లేదన్నారు. హోదాతో సంబంధం లేకుండానే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. జరిగిన అభివృద్ధి ఏమిటో సిఎంకే తెలియాలి. పైగా ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో గొడవలు పెట్టుకోమంటారా అని ఎదురు ప్రశ్నించటం నిజంగా సిగ్గుపడాల్సిన అంశమే.  హక్కుల గురించి అడగటమంటే గొడవ పెట్టుకున్నట్లే అని చంద్రబాబు అనుకోవటమే విచిత్రం.

 

ఎప్పుడైతే చంద్రబాబు ప్రత్యేకహోదాను చులకన చేస్తూ మాట్లాడారో వెంటనే మిగిలిన వారందుకున్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజైతే ఏం మాట్లాడారో కూడా అర్ధంకాకుండా వచ్చీరాని తెలుగులో ఏదో మాట్లాడేసారు. ఇక, ఎంపి రాయపాటి సాంబశివరావైతే ప్రత్యేకహోదా కష్టమని తేల్చేసారు. పైగా పవన్ మోడికి బాగా సన్నిహితుడు కదా? హోదాను సాధించమనండంటూ ఎగతాళిగా మాట్లాడారు. హోదాను సాధించుకువస్తే పవన్ కు 100 కొబ్బరికాయలు కొడతారట. ఇక సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు కూడా అదే ధోరణిలో మట్లాడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెతమంది ఎలా మాట్లాడుతారో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?