ఆంధ్రా జబ్బుకు సింగపూర్ వైద్యం

Published : Dec 14, 2016, 08:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఆంధ్రా జబ్బుకు సింగపూర్ వైద్యం

సారాంశం

సింగపూర్ ఎకనమిక్ మోడలే ఎపికి  దిక్కంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆంధ్రా వాళ్లకి అన్నింటికీ సింగపూరే  దిక్కు.

 

రాజధాని, రోడ్లు, విద్యద్దీపాలు, భవనాలు, పోలీసింగ్ అన్నింటికి సింగపూరే ఆదర్శం. ఇపుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక సింగపూర్ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అర్ధిక సమస్య కు పరిష్కరం కూడా సింగపూర్ లోనే ఉందని బాబు సెలవిచ్చారు.

 

ఎలాగంటే సింగపూరోళ్లు ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టి  బాగా రాబడి తీసుకువస్తున్నారు. అందువల్ల ఆంధ్ర వాళ్లు కూడా తామెక్కడ బలంగా ఉన్నారో  ఆరంగాలలో ఇతర దేశాలలోపెట్టుబడులు పెడితే సరి, అని  మంత్రోపదేశం చేశారు.

 

సింగపూర్ ప్రభుత్వం స్థానికంగా వచ్చే అదాయానికి తోడుగా, విదేశాలలో పెట్టుబడులు పెంచి మరికొంత ఆదాయం సమకూర్చకుంటున్నదని చెబుతూ ఈ మోడల్ పాలో కావాలని ఆయన అర్థిక శాఖ అధికారులకు చెప్పారు. అపుడు రాష్ట్రానికి డబ్బు డబ్బు.

 

ముఖ్యమంత్రి  సలహా అధికారులందరిని ఆశ్చర్య పరిచింది.  ఇంతఈజీగా ఆదాయం పెంచుకునే మార్గం ఆయన ఇంతకు ముందే చెప్పి ఉంటే ఈ పాటికి సగం పని పూర్తయ్యేది కదాఅనేది వారి అభిప్రాయం.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?