కిచెన్ లో భార్య తల: మూడో భార్యను హత్య చేసిన భర్త, సమీప బంధువును కూడా...

Published : Oct 11, 2020, 11:31 AM ISTUpdated : Oct 11, 2020, 11:48 AM IST
కిచెన్ లో భార్య తల: మూడో భార్యను హత్య చేసిన భర్త, సమీప బంధువును కూడా...

సారాంశం

భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నాగేశ్వరరావు తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. భార్యను హత్యచేసిన తర్వాత ఆమె తలను కిచెన్ లో పెట్టాడు.


నెల్లూరు: భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నాగేశ్వరరావు తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. భార్యను హత్యచేసిన తర్వాత ఆమె తలను కిచెన్ లో పెట్టాడు.

also read:నెల్లూరులో దారుణం: ఇద్దరు మహిళల హత్య

నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని నాలుగో మైలులో ఈ ఘటన చోటు చేసుకొంది.  నాగేశ్వరరావుకు నిర్మలమ్మ మూడో భార్య. మొదటి భార్యకు నాగేశ్వరరావు విడాకులు ఇచ్చాడు. రెండో భార్య మరణించింది. నిర్మలమ్మ మూడో భార్య.

నిర్మలకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నాగేశ్వరరావు భార్యను హత్య చేశాడు. మొండెం నుండి ఆమె తలను వేరు చేసి కిచెన్ లో పెట్టాడు.  తన భార్య వివాహేతర సంబంధానికి సమీప బంధువు రమణమ్మ సహకరిస్తోందని నాగేశ్వరరావు అనుమానించాడు. 

భార్యను హత్య చేసిన తర్వాత నాగేశ్వరరావు రమణమ్మ ను కూడ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకొన్న నాగేశ్వరరావు దారుణంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్