నెల్లూరులో దారుణం: ఇద్దరు మహిళల హత్య

Published : Oct 11, 2020, 10:38 AM IST
నెల్లూరులో దారుణం: ఇద్దరు మహిళల హత్య

సారాంశం

కుటుంబ కలహాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు చేసిన తర్వాత నిందితుడు పోలీసులకు  లొంగిపోయాడు.  


నెల్లూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు చేసిన తర్వాత నిందితుడు పోలీసులకు  లొంగిపోయాడు.నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని నాలుగో మైలులో ఈ ఘటన చోటు చేసుకొంది.  నాగేశ్వరరావు, నిర్మలమ్మ భార్యాభర్తలు.

కుటుంబ కలహాల నేపథ్యంలో నాగేశ్వరరావు తన భార్య నిర్మలమ్మను హత్య చేశాడు. ఆమెతో పాటు బంధువు రమణమ్మను కూడ కిరాతకంగా హత్య చేశాడు.  వీరిద్దరిని హత్య చేసిన తర్వాత నాగేశ్వరరావు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 

భార్యతో పాటు బంధువును కూడ నాగేశ్వరరావు ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య గతంలో కూడ గొడవలు జరిగాయా.. హత్యకు గల కారణాలపై  పోలీసులు  మృతుల కుటుంబసభ్యులను, స్థానికులను విచారిస్తున్నారు. 

24 గంటల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు చోటు చేసుకొన్నాయి. వరుస హత్యలతో స్థానికులు భయబ్రాంతులకు గరయ్యారు.మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే