నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

By Siva KodatiFirst Published Aug 12, 2019, 7:47 AM IST
Highlights

శ్రీశైలం నుంచి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడిచిపెట్టడంతో నాగార్జున సాగర్ జలాశయం నెమ్మదిగా నిండుతోంది. గంటకు అడుగు చొప్పున నీటి మట్టం పెరుగుతుండటంతో సోమవారం ఉదయం 7.30 ప్రాంతంలో సాగర్‌లోని మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

వరద ప్రవాహం దృష్ట్యా సాగర్ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. ప్రజలు చేపల వేట, పశువుల మేతకు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద ఉధృతితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

ఇప్పటికే జూరాల 66 గేట్లు ఎత్తివేయగా.. శ్రీశైలం ప్రాజెక్ట్ పది గేట్లు 33 అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.  అటు సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు, 312 టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రికి 199 టీఎంసీలకు చేరుకుంది.

కుడికాల్వకు 2,419 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,224 క్యూసెక్కులు, ఎస్ఎల్‌బీసీ ఎత్తిపోతల లో లెవల్ కేనల్‌కు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్ట్ ఇవాళ రాత్రికి నిండనుంది. 

click me!