మాకు కులం ఉండదు, ఖాకీ కులం మాత్రమే: జగన్ కు డీజీపీ సెటైర్

By Nagaraju penumalaFirst Published Feb 5, 2019, 4:00 PM IST
Highlights

తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం జగన్ ఫిర్యాదుపై స్పందించారు. వైఎస్ జగన్ ఫిర్యాదును కేవలం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు తెలిపారు. ప్రమోషన్లు సీనియారిటీ ప్రకారమే ఇస్తాం తప్ప ఇష్టం వచ్చినట్లు ఇవ్వరన్నారు. 

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూటర్ సెటైర్ వేశారు. పోలీసులకు కులం అంటూ ఏమీ ఉండదని ఉండేది కేవలం ఖాకీ కులం మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం జగన్ ఫిర్యాదుపై స్పందించారు. వైఎస్ జగన్ ఫిర్యాదును కేవలం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు తెలిపారు. ప్రమోషన్లు సీనియారిటీ ప్రకారమే ఇస్తాం తప్ప ఇష్టం వచ్చినట్లు ఇవ్వరన్నారు. 

ప్రమోషన్లు పారదర్శకంగానే జరిగాయని అందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై 6 రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మద్యం, డబ్బు తరలింపు అడ్డుకోవడంపై తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. 

ఇకపోతే ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఒక అధికారికి ఏకంగా లేని పదవిని కూడా సృష్టించారని వైఎస్ జగన్ సిఈసీకి ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి బహిష్కరించాలని జగన్ కోరిన విషయం తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రమోషన్లపై తేల్చుకుందామా, నేను రెడీ: జగన్ కి హోంశాఖ మంత్రి చినరాజప్ప సవాల్

click me!