నారాయణకు కాస్త అన్నం పెట్టండి.. : చిరంజీవిపై చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్

Published : Jul 20, 2022, 10:09 AM IST
నారాయణకు కాస్త అన్నం పెట్టండి.. : చిరంజీవిపై చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్

సారాంశం

సీపీఐ నారాయణపై జనసేన నేత, నటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌‌లపై నారాయణ చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. 

సీపీఐ నారాయణపై జనసేన నేత, నటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌‌లపై నారాయణ చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి..  ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడని ట్విట్టర్ వేదికగా నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్తా అన్నం పెట్టండి అని మెగా అభిమానులను కోరుతూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

‘‘ఇటీవలి కాలంలో మెగా అభిమానులు, జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. అందుకే మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. 

ఇటీవల సీపీఐ నారాయణ మాట్లాడుతూ... ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభకు చిరంజీవిని పిలవడాన్ని తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడని కామెంట్ చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. నారాయణ మాట్లాడుతూ...“పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రజలను మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణను పక్కనబెట్టి ఈ చిల్లర బేరగాడ్ని చిరంజీవిని స్టేజి మీదకి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రాలేదో నాకు తెలియదు. కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేది. పవన్‌ కళ్యాణ్‌ ఓ ల్యాండ్ మైన్ వంటివాడు. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఆయన కూడా అంతే. ఎప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదు. 

మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా సిఎం జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం కేంద్రానికి సరండర్ అయిపోయారు. మోడీ కనుసన్నలలో మెలుగుతూ ఎన్డీయే అభ్యర్ధికి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఏపీలో రాజకీయ పార్టీలు, నాయకుల ఈ బలహీనతలతోనే కేంద్రం ఆడుకుంటుంది’’ అని అన్నారు. 

అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై నారాయణ చేసిన ఈ కామెంట్స్‌పై మెగా అభిమానులతో పాటు, జనసైనికకులు మండిపడుతున్నారు. పలుచోట్ల నారాయణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్