షాప్ నుంచి ఇంటికెళ్లి, వంటచేసి... ఫ్యాన్ కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. !

By AN TeluguFirst Published Sep 2, 2021, 4:10 PM IST
Highlights

ఎస్. కోట పట్టణానికి చెందిన నాని అనే వ్యక్తి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని మీ చెల్లి వాసవి బెదిరిస్తుంది అని, వెంటనే ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉండాలని చెప్పాడు.

విజయనగరం : ఎస్.కోట పట్టణంలోని ఎరుకలి పేటలో నేమాపు వాసవి (22) అనే యువతి మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలికి తల్లి లక్ష్మి సోదరి రోజా ఉన్నారు.  

ముగ్గురు కలిసి లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన జ్యూస్, పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనపై మృతురాలి అక్క రోజా బుధవారం స్థానిక విలేకరులకు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్. కోట పట్టణానికి చెందిన నాని అనే వ్యక్తి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని మీ చెల్లి వాసవి బెదిరిస్తుంది అని, వెంటనే ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉండాలని చెప్పాడు.

దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా వాసవి కింద పడి ఉంది. ఎంత లేపినా చలనం లేకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అని చెప్పింది.  మృతురాలి తల్లి లక్ష్మి  ఫిర్యాదు మేరకు  అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  లక్ష్మీ ప్రసన్న కుమార్ చెప్పారు. 

కాగా మృతురాలు వాసవి రాసినట్టు చెబుతున్న రెండు పేజీల లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు. చేతిరాతను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం.  ‘వాసవి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.  కానీ ఆమె పిరికిది కాదు.  చాలా తెలివైనది.  నేను దుకాణం వద్ద ఉండగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి వంట చేసింది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే ఎందుకు వంట చేస్తుంది. వైరు,  తాడు, పెద్ద చున్ని లేకుండా ఫ్యాన్ కు ఎలా ఉంది వేసుకుంటుంది? వాసవిని ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి లక్ష్మి ఆరోపించింది. రాత్రి ఇంటి బయట ఒక వ్యక్తి చీకట్లో నిలుచుని ఉండగా వీధిలోని మహిళ ఒకరు చూశారని, మరో వ్యక్తి మేడ పైకి వెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. వాసవి మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి న్యాయం చేయాలని అంతమవుతుంది.
 

click me!