ఓవరాక్షన్ చేస్తున్న పోలీసులకు... భవిష్యత్ లో భంగపాటు తప్పదు: అచ్చెన్న వార్నింగ్

Arun Kumar P   | Asianet News
Published : Sep 02, 2021, 03:26 PM IST
ఓవరాక్షన్ చేస్తున్న పోలీసులకు... భవిష్యత్ లో భంగపాటు తప్పదు: అచ్చెన్న వార్నింగ్

సారాంశం

తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కొంతమంది పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని... అలాంటి వారికి భవిష్యత్ లో భంగపాటు తప్పదని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

అమరావతి: అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేయాలని దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళా, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేయడమే కాదు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  

''తిరుపతిలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయం. అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేయడమే కాదు చేయి చేసుకున్న పోలీసులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

''బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు శ్రీరామ్ చిన్నబాబుపై చేయి చేసుకున్నారు. తాడేపల్లి ఆదేశాలతోనే బీసీ నేతలను అణచాలని చూస్తున్నారు. బీసీలను నడివీధుల్లో రౌడీని లాక్కెళ్లినట్లు లాక్కెళ్తారా? ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇంతలా రెచ్చిపోతున్నారు.? పోలీస్ వ్యవస్థకే ఇదొక మాయని మచ్చ. వైసీపీ కార్యకర్తల ఆగడాల కంటే పోలీసుల దుశ్చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి'' అని ఆదోళన వ్యక్తం చేశారు. 

read more  హోం మంత్రి సుచరితకు చేదు అనుభవం..!

'' పోలీసులు వేసుకుంది జగన్ చొక్కాలు కాదు.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలి. జగన్ పట్ల అభిమానం వుంటే ఖాకీ చొక్కా వదిలి వైసీపీ చొక్కా తొడుక్కోండి. అత్యాచారాలు చేసిన వారిని కొట్టడానికి లేవని చేయి..బాధితుల తరపును పోరాడిన వారిపై లేస్తుందంటే ఏం సందేశం పంపుతున్నారు.? పోరాడే వారిని బెదిరించి నిందితులకు భరోసా ఇస్తున్నారా.?'' అని నిలదీశారు. 

''ప్రజల కోసం ప్రతిపక్షం బయటకు వస్తే గృహనిర్భందాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాటిస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే దిగిపోతుంది..కానీ పోలీస్ వ్యవస్థకు పడిన మచ్చ పోవడం కష్టమన్న విషయం మదిలో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఓవరాక్షన్ చేసే పోలీసులకు భవిష్యత్ లో భంగపాటు తప్పదు'' అని అచ్చెప్ప హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే