మైలవరం పంచాయతీ : రంగంలోకి జగన్.. నిన్న జోగి రమేశ్‌తో భేటీ, ఇవాళ తాడేపల్లికి వసంత కృష్ణ ప్రసాద్

By Siva KodatiFirst Published Feb 9, 2023, 3:53 PM IST
Highlights

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో స్వయంగా సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. ఇవాళ ఇదే వ్యవహారంపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో సీఎం మాట్లాడనున్నారు. 

వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో జయకేతనం ఎగురవేయాలని చూస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పార్టీలో తలనొప్పులు నిద్రపట్టనివ్వడం లేదు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంలు అధిష్టానాన్ని చికాకు పెడుతున్నారు. దీనితో పాటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య సఖ్యత లేదు. ఎన్నికల సమయంలో ఈ పరిణామాలు వైసీపీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో వీటిని పరిష్కారించే బాధ్యతను కీలక నేతలకు అప్పగించింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు స్వయంగా సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. ఇటీవల వైసీపీ ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో .. నిన్న జగన్ మంత్రి జోగి రమేశ్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి మాట్లాడారు. ఇవాళ ఇదే వ్యవహారంపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో మాట్లాడనున్నారు. 

ఇకపోతే..  కృష్ణ ప్రసాద్ సొంత పార్టీపై బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కూడా వైసీపీ అధినాయకుడికి తలనొప్పి వ్యవహారంలా మారింది. ఇటీవల ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు టీపీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తో భేటి అయ్యారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం నుంచి కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీలో తన కుమారుడికి ప్రియారిటీ ఇవ్వడం లేదనే నాగేశ్వర రావు టీడీపీ ఎంపీతో చర్చలు జరిపారని వార్తలు వెలువడ్డాయి. 

ALso REad: మైలవరం వైసీపీలో కొత్త పంచాయతీ.. స్థానికుడికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్, ‘‘వసంత’’పై పెరుగుతున్న అసమ్మతి

అయితే ఈ భేటీపై ఇలా వార్తలు రావడంతో వసంత నాగేశ్వర రావు స్పందించారు. తమ భేటీలో రాజకీయ కోణం లేదని అన్నారు. నాని కూతురు పెళ్లికి హాజరు కాలేకపోయినందుకే సోమవారం వెళ్లి కలిశానని చెప్పారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన పలు వివరాలు అందించానని, వాటి కోసం నిధులు కేటాయిస్తానని చెప్పారని, దీనికి ఆయన కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. నాగేశ్వర రావు ఇలా వివరణ ఇచ్చినప్పటికీ ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని చర్చలు జరుగుతున్నాయి. 

కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం అధికార పార్టీపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన పార్టీని విమర్శించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీలోని పలువురు నాయకులపై అసంతృప్తి ఉందని చెప్పారు. తనకు రౌడీలను వెంటేసుకొని తిరగడం చేతకాదని తెలిపారు. అందుకే తాను కిందటి తరం పొలిటీషియన్ గా మిగిలిపోయానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం పాలిటిక్స్ లో ఉందని, కానీ ఇలాంటి పాలిటిక్స్ ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రస్తుత పాలిటిక్స్ లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. 
 

click me!