మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పనితీరు నచ్చకపోతే చెప్పాలని వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కోరారు.
విజయవాడ: తన పనితీరుపై అసంతృప్తి ఉంటే చెప్పాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కార్యకర్తలను కోరారు. మంగళవారంనాడు మైలవరం వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు హాజరయ్యారు. రాజకీయాల్లో తనకు సంపాదించుకోవాల్సిన అవసరం లేదన్నారు.తాను పోటీ చేయకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి విజయం కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తనకు సంపాదించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకు రియల్ ఏస్టేట్ లో సంపాదన ఎక్కువనే విషయం మీకందరికీ తెలుసునన్నారు. తన పనితీరుపై ఇసుమంత అసంతృప్తి ఉన్నా కూడా వెంటనే పార్టీ పరిశీలకులకు చెప్పాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైసీపీలోనే ఉంటానని చెప్పారు.
ఇటీవల కాలంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న కూడా వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఉందన్నారు. తాను గత తరం నాయకుల మాదిరిగానే మిగిలిపోయినట్టుగా చెప్పారు. తాను పుట్టేనాటికి తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. ఈనాటి రాజకీయాల్లో ముందుకు వెల్లాలంటే ప్రస్తుతం 10 మంది పొరంబోకులుఉండాలన్నారు. వెనుకటి పరిస్థితి ఇప్పుడు పనికిరాదని ఆయన చెప్పారు.అయితే ఎన్నికల సమయంలోనే తాను రాజకీయాలు మాట్లాడుతానన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.
undefined
గుంటూరులో తొక్కిసలాట సమయంలో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కు అనుకూలంగా వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ఉయ్యూరు శ్రీనివాస్ తనకు తెలుసునన్నారు. ఎన్ఆర్ఐలను ఇబ్బంది పెడితే రాష్ట్రంలో ప్రజలకు సహాయం చేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చే అవకాశం ఉండదని ఆయన చెప్పారు. గుంటూరు ఘటనను ఆసరాగా చేసుకొని వైసీపీ నేతలు టీడీపీపై ఎదురు దాడి చేస్తున్న సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపాయి.
మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ వర్గంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు పొసగడం లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయితీ జరిగింది. ఆ తర్వాత ఈ విషయమై గత ఏడాది డిసెంబర్ మాసంలో సీఎం జగన్ ఈ విషయమై వసంత కృష్ణ ప్రసాద్ తో చర్చించారు. జోగి రమేష్ తో విబేధాలపై ఇద్దరిని పిలిచి మాట్లాడుతానని కూడా జగన్ హామీ ఇచ్చారు.