మైదుకూరు టిక్కెట్ నాదే, డీఎల్ టీడీపీలోకి రారు: పుట్టా సుధాకర్ యాదవ్

By Nagaraju penumalaFirst Published Feb 21, 2019, 4:50 PM IST
Highlights

గురువారం సాయంత్రం లేదా శుక్రవారం మైదుకూరు అభ్యర్థిగా తననే చంద్రబాబు ప్రకటిస్తారంటూ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డీఎల్‌ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుని మైదుకూరు టికెట్‌ను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్న సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

కడప: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్ ను మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. 

అటు జిల్లాకు చెందిన మంత్రి, కడప పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆదినారాయణరెడ్డి సైతం మైదుకూరు టికెట్ డీఎల్ రవీంద్రారెడ్డికే ఇవ్వాలని ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. 

అంతేకాదు మైదుకూరు అసెంబ్లీ నియోజకవ్గరం ఇంచార్జ్ గా ఉన్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రొద్దుటూరు నుంచి పోటీ చెయ్యించాలని సలహా ఇచ్చారు. పుట్టాను ప్రొద్దుటూరు నుంచి పోటీ చెయ్యించాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. 

అయితే పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం మైదుకూరు రేసు నుంచి వెనక్కి తగ్గేది లేదంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వస్తారనేది పుకార్లు మాత్రమేనని ఆయన రారు అని చెప్పుకొచ్చారు. 

click me!