రాజంపేట టీడీపి అభ్యర్థులు వీరే: క్లియర్ చేసిన చంద్రబాబు

Published : Feb 21, 2019, 04:35 PM IST
రాజంపేట టీడీపి అభ్యర్థులు వీరే: క్లియర్ చేసిన చంద్రబాబు

సారాంశం

సమావేశం అనంతరం  రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా చెంగల్ రాయుడు, రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి, పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డిని ప్రకటించారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కడప జిల్లాలో అభ్యర్థులను ఎంపిక చేసిన చంద్రబాబునాయుడు గురువారం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై క్లియరెన్స్ ఇచ్చారు.  

సమావేశం అనంతరం  రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా చెంగల్ రాయుడు, రాయచోటి అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డి, పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డిని ప్రకటించారు. 

అయితే మిగిలిన రెండు అసెంబ్లీ స్థానాలను చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలపై అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలు బీసీలకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. 

అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. మరోవైపు తంబళ్లపల్లి టిక్కెట్టును మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్, లక్ష్మీ దేవమ్మ ఆశిస్తున్నారు. అలాగే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు పెండింగ్ లో పెట్టారు. 
 
PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu