నా లవర్ మోసం చేసింది.. బస్సులో ప్రేమికుడి వీరంగం, ఐలవ్ యూ అంటూ జనాలమీదికి మట్టి చల్లుతూ హంగామా..

By SumaBala Bukka  |  First Published Oct 25, 2023, 12:25 PM IST

ఫుల్లుగా మద్యం తాగి బస్సు ఎక్కిన ఓ యువకుడు బస్సులో వీరంగం సృష్టించాడు. తన ప్రియురాలు మోసం చేసిందంటూ గొడవ మొదలెట్టాడు. 


చిత్తూరు : ఓ యువకుడు మంగళవారం నాడు బస్సులో ఎక్కి నానా హంగామా చేశాడు. నా లవర్ మోసం చేసింది అంటూ… వీరంగం సృష్టించాడు. అతను ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు  తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం నాడు  తిరుపతిలో వెలుగు చూసింది. తిరుపతిలో కర్ణాటక ఆర్టీసీ రాజహంస బస్సులో బెంగళూరుకు వెళ్లడానికి  ఓ 26 ఏళ్ల యువకుడు ఎక్కాడు. 

అప్పుడు, అతని ప్రవర్తన అంతా బాగానే ఉంది. అప్పటికి అతడు ఫుటుగా మద్యం సేవించి ఉన్నాడు. బస్సు కొంత దూరం కదలగానే  కిక్కు ఎక్కువై.. నానా హంగామా చేయడం మొదలుపెట్టాడు. ఇక బంగారుపాలెం దగ్గరికి వచ్చేసరికి..‘నా లవర్ నన్ను మోసం చేసింది’ అంటూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Latest Videos

నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభం: చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ( వీడియో)

అతడిని ప్రయాణికులు చాలాసార్లు వారించారు. అయినా అతను వినలేదు.. అరవడం, ఇబ్బందులకు గురి చేయడం ఆపలేదు. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు అతడిని చితకబాదారు. కండక్టర్, డ్రైవర్లు విధిలేక పలమనేరులోని అంబేద్కర్ సర్కిల్ లో అతడిని బస్సు నుంచి దించేశారు. దీంతో, ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. ఐ లవ్ యు అంటూ రోడ్డు మీద గట్టిగట్టిగా కేకలు వేస్తూ జనం మీదికి మట్టి చల్లడం ప్రారంభించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. యువకుడిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా అతడు వినలేదు. మద్యం మత్తులో తిక్కగా వ్యవహరిస్తున్నాడని గ్రహించిన స్థానికులు వెంటనే అతని మీద నీళ్లు పోసి మత్తు దింపారు.  ఆ తరువాత అదే బస్సులో ఎక్కించి పంపించారు. 

click me!