
అనకాపల్లిలో వివాహిత హత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అచ్యుతాపురం మండలం ఎస్‌కేఆర్ లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. తొలుత దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నం చేసున్నారని భావించారు. కానీ.. ఆత్మహత్య కాదని హత్యేనని నిర్దారించారు. గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం మొదట అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. వివాహిత మృతదేహాన్ని కూడా తొలుత ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎంఎల్‌సీ కేసు కావడంతో కేజీహెచ్ మార్చురీకి పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఎం.శ్రీనివాస్, కూర్మన్నపాలెం చెందిన మహాలక్ష్మి ఇంటర్మీయట్ నుంచి స్నేహితులు.. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.కానీ కులాలు వేరు కావడంతో పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకేముంది.. వారిని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం తొలుత హాయిగానే సాగినా..రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య విభేదాలు రావడం ప్రారంభమయ్యాయి. నిత్యం గొడవలు పోలీసు కేసులు, కౌన్సిలింగ్ లు .. పెద్దలు చెప్పిన ఎంతా సర్దిచెప్పిన ఫలితం లేకుండా పోయింది. దీంతో విడిపోయాలని నిర్ణయించుకున్నారు. 2021లో వీరిద్దరూ మ్యూచువల్ డైవోర్స్ కి సిద్దమయ్యారు. అయితే.. శ్రీనివాస్ మాత్రం కోర్టుకు సరిగా రాకపోవడంతో విడాకుల ప్రక్రియ ఆలస్యమైంది. నిత్యం మహాలక్ష్మిని వేధింపులకు , భయాభంత్రులకు గురి చేశాడు. ఓ సైకోలా తయారయ్యాడు. మొత్తం మీద తన భార్య మహాలక్ష్మి మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలని భావించాడు.
కానీ, గత నెల రోజులుగా మంచి వాడిలా నటిస్తూ..మహాలక్ష్మికి దగ్గర కావాలని ప్రయత్నించాడు. పథకం ప్రకారం..సోమవారం ఉదయం శ్రీనివాస్ అచ్యుతాపురం వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. తనతో పాటు బిర్యానీ, మత్తు మందు, కత్తి కూడా తీసుకుని వచ్చాడు. అక్కడి నుండే మహాలక్ష్మికి ఫోన్ చేసి.. లాడ్జీకి రావాలని ప్రాధేయపడ్డాడు. నమ్మిన మహాలక్ష్మి లాడ్జీకి వచ్చింది. అనంతరం శ్రీనివాస్ తన పథకం ప్రకారం మహాలక్ష్మిని హతమార్చాడు. తాను కూడా మత్తు ఇంక్షన్ తీసుకున్నాడు. మహాలక్ష్మి శరీరంపై 20 వరకు కత్తిపోటు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో వారున్న గదిలో నుంచి శబ్దాలు రావడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో సిబ్బంది వెంటనే రూమ్ వద్దకు వెళ్లి తలుపులు కొట్టగా.. తాము దుస్తులు మార్చు కుంటున్నామని శ్రీనివాస్ చెప్పడంతో సైలెంట్ అయ్యారు. అయినా అనుమానం తీరని సిబ్బంది తమ లాడ్జి మేనేజర్‌కు విషయం చెప్పారు. మేనేజర్‌పైకి వెళ్లి తలుపులు తట్టగా ఎటువంటి సమాధానం రాలేదు. ఏమో జరిగిందని భావించిన లాడ్జ్ మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ మురళీరావు, ఇతర పోలీసు సిబ్బంది వచ్చి గది తలుపులు పగలగొట్టారు. అప్పటికే మహాలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అలాగే.. శ్రీనివాస్ చేతిపైన, కడుపు మీద గాయాలు ఉన్నాయి. మహాలక్ష్మిని పరిశీలించిన పోలీసులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు.
శ్రీనివాస్ పరిస్థితి కూడా విషయంగా ఉండటంతో అంబులెన్స్ ను పిలిచి.. మహాలక్ష్మి మృతదేహంతోపాటు గాయపడిన శ్రీనివాస్ ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ కు ప్రాథమిక చికిత్స చేసి. విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. అయితే.. ఆమె లాడ్జీకి వచ్చినట్టు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని ఎక్కడా నమోదుకాలేదు. కరెంటు సరఫరా నిలిచిపోయిన సమయంలో వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.