ఇదీ తల్లి ప్రేమంటే : గుంతలో పడ్డ చిన్నారులు.. పిల్లలను రక్షించి తాము ప్రాణాలొదిలి

Siva Kodati |  
Published : May 31, 2023, 07:36 PM ISTUpdated : May 31, 2023, 07:37 PM IST
ఇదీ తల్లి ప్రేమంటే  : గుంతలో పడ్డ చిన్నారులు.. పిల్లలను రక్షించి తాము ప్రాణాలొదిలి

సారాంశం

నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో పడిపోయిన తమ పిల్లలను రక్షించేందుకు ఇద్దరు తల్లులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.   

నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తమ పిల్లలను రక్షించబోయి ఇద్దరు తల్లులు మృతి చెందారు. బుధవారం పెన్నా నది రివిట్‌మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు పిల్లలు పడ్డారు. వాళ్లను రక్షించేందుకు గాను ఆ గుంతలోకి దూకారు ఇద్దరు తల్లులు షాహీనా, షబీనా. పిల్లలను కాపాడినప్పటికీ, బురదలో కూరుకుపోవడంతో వారు పైకి రాలేకపోయారు. చివరికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా పెన్నా నది వద్ద రివిట్‌మెంట్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వర్షాలు పడటంతో మొత్తం బురదమయం అయిపోయింది. ఆ బురదలో చిక్కుకుని చనిపోయారు ఇద్దరు తల్లులు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!