నువ్వు నేర్పిన విద్యే నిన్ను ముప్పు తిప్పలుపెడుతుంది: చంద్రబాబుపై బొత్స

Published : Oct 04, 2019, 02:59 PM ISTUpdated : Oct 04, 2019, 03:01 PM IST
నువ్వు నేర్పిన విద్యే నిన్ను ముప్పు తిప్పలుపెడుతుంది: చంద్రబాబుపై బొత్స

సారాంశం

చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే అసహ్యం వేస్తోందని చెప్పుకొచ్చారు. ఆయన చిన్నమెుదడుకు ఏదో అయినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తీరు ఏమాత్రం మారలేదని మండిపడ్డారు. 

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు ఇంకా తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే అసహ్యం వేస్తోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చిన్నమెుదడుకు ఏదో అయినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తీరు ఏమాత్రం మారలేదని మండిపడ్డారు. 

 ఇకపోతే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే ప్రభుత్వం సహించేది లేదన్నారు. ఎవరు మీద అసభ్యకర పోస్టులు పెట్టినా ఒప్పుకునేది లేదన్నారు. ఇకపోతే మాజీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్‌ పై అనుమానం కలుగుతుందన్నారు.  

చంద్రబాబుపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లపై  విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవి ఎవరు పెట్టారో కూడా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఆ పోస్టులు నిజమైనవో కావో చూడాల్సిన అవసరం ఉందన్నారు. 

చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎవరూ భయపడేవారు లేరన్నారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలనుకునే మనస్తత్వం నుంచి చంద్రబాబు నాయుడు బయకు రావాలని సూచించారు బొత్స సత్యనారాయణ. 

గతంలో పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఇప్పుడు అలాంటి పరిస్థితులే వస్తాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ లను తాము ప్రోత్సహించడం లేదన్నారు. చంద్రబాబు నేర్పిన విద్యే ఆయనకు తిప్పలు తెస్తున్నాయని ఆరోపించారు.  

లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దానిపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. నాలుగు నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్రాభివృద్ధికి ముందుకు వెళ్తుంటే చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

 

PREV
click me!

Recommended Stories

RK Roja Celebrate Kanuma GoPuja: కనుమ సందర్బంగాగోపూజ నిర్వహించిన ఆర్కె రోజా| Asianet News Telugu
Kethireddy Pedda Reddy Pressmeet: ఎక్క‌డైనా చర్చకు సిద్ధం జేసీకి పెద్దారెడ్డి స‌వాల్| Asianet Telugu