మీ బాధలు విన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడ్డా: వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

By Nagaraju penumala  |  First Published Oct 4, 2019, 12:51 PM IST

సొంతంగా ఆటో, క్యాబ్, కారు ఉంటే వారికి ప్రతీ ఏడాది రూ.10వేలు సాయం చేయనున్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అమలు చేసినట్లు తెలిపారు. 


ఏలూరు:  ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. వైయస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ బృహత్తర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ ఏడాది ఆటో, క్యాబ్, కారు డ్రైవర్లకు రూ.10వేల రూపాయలు అందివ్వబోతున్నట్లు తెలిపారు. రెండు నిమిషాల్లో రూ.10వేలు అందిచేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

Latest Videos

undefined

ప్రజాసంకల్పయాత్ర పాదయాత్రలో పాల్గొన్న ఆటో, క్యాబ్, కారు డ్రైవర్ల కష్టాలను తాను చూశానని చెప్పుకొచ్చారు. లక్ష 73వేల102 మందికి ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.10వేలు అందిచనున్నట్లు తెలిపారు. లక్ష 75వేల 352 మంది ఈ పథకానికి అప్లై చేయగా లక్ష 73వేల 102 మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా 79వేల మంది బీసీలకు, 40వేల మంది ఎస్సీలకు, 6వేలమంది ఎస్టీలకు, మైనారిటీలు 1,705, కాపు సామాజిక వర్గానికి చెందిన  20వేల మందికి అలాగే బ్రహ్మణులకు సైతం లబ్ధిపొందనున్నారు. 

ఈ పథకానికి అర్హలైన వారు మిగిలిపోతే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అక్టోబర్ 31 వరకు ఈ పథకాన్ని పొండిగించామని నవంబర్ లో రాని వారికి అందజేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. 

సొంతంగా ఆటో, క్యాబ్, కారు ఉంటే వారికి ప్రతీ ఏడాది రూ.10వేలు సాయం చేయనున్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అమలు చేసినట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వెళ్లేలా బటన్ నొక్కి వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. 

click me!