మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే: చంద్రబాబుపై జగన్ ధ్వజం

By Nagaraju penumalaFirst Published Oct 4, 2019, 1:06 PM IST
Highlights


మాట్లాడితే చాలు 14ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్దాలేనని విమర్శించారు. అంతటి రాజకీయ వేత్త ఇలాంటి అబద్దాలు ఆడొచ్చా అంటూ ప్రశ్నించారు. 

ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అభినందించాల్సింది పోయి మంటలేస్తున్నారంటూ తిట్టిపోశారు.  

వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక అక్కసుతో వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తిట్టిపోశారు. అక్టోబర్ 2న సాక్షాత్తు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను జగన్ ఖండించారు.  

దేశ చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, ప్రతీ రెండువేల మంది జనాభాకు 10 మంది చొప్పున ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం తాను కృషి చేస్తే దానిపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 
అక్టోబర్ 2న మద్యం అమ్మారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందా అని నిలదీశారు. ఎక్కడ మద్యం దుకాణాలు తెరిచారో ప్రజలు చూశారా అని ప్రశ్నించారు. ఇలా చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 43వేల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గుడి, బడి అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇచ్చారని ఆరోపించారు. 

పర్మిట్ రూంలు ఇచ్చి మరీ మద్యాన్ని ప్రోత్సహించారని జగన్ ఆరోపించారు. పర్మిట్ రూమ్ లు నడిరోడ్డుపై ఉంటే అటుగా మహిళలు వెళ్లాలంటేనే భయపడేవారని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితిని చూసిన తాను పర్మిట్ రూమ్ లను సైతం రద్దు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. 

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్ట్ షాపులను రద్దు చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే మద్యం దుకాణాలను కూడా తగ్గించినట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కేవలం 20 శాతం దుకాణాలను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. 
 
మద్యం అమ్మకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి భిన్నంగా పనిచేస్తుంటే అభినందించాల్సింది పోయి అక్టోబర్ గాంధీ జయంతిన మద్యం దుకాణాలు తెరిచారంటూ చంద్రబాబు  అబండాలు వేస్తున్నారని మండిపడ్డారు. 

మాట్లాడితే చాలు 14ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్దాలేనని విమర్శించారు. అంతటి రాజకీయ వేత్త ఇలాంటి అబద్దాలు ఆడొచ్చా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న అబద్దపు ప్రచారం చూసి బాధేస్తుందని కానీ ప్రజల కళ్లలో చిరునవ్వును చూసిన తర్వాత అదంతా మాయమైపోతుందన్నారు సీఎం జగన్  

ఈ వార్తలు కూడా చదవండి

మీ బాధలు విన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడ్డా: వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

click me!