ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా అన్నివిధాల, అందరికీ సహకరిస్తున్నారని ఆయన కొనియాడారు. మిగిలిన ప్రాంతాల్లో సహాయకార్యక్రమాలు జరుగుతున్నా.. నగరిలో మాత్రం ఎమ్మెల్యే రోజా తప్ప.. ఇంకెవరూ పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నగరి ఎమ్మెల్యే రోజా పై చిత్తూరు జిల్లా నగరి మున్నిపల్ ఉద్యోగి ఒకరు ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
Also Read బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి... లేకుంటే రూ.1000 జరిమానా...
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కుల, మతాలకు అతీతంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ ఉద్యోగి ఒకరు అన్నారు.
ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా అన్నివిధాల, అందరికీ సహకరిస్తున్నారని ఆయన కొనియాడారు. మిగిలిన ప్రాంతాల్లో సహాయకార్యక్రమాలు జరుగుతున్నా.. నగరిలో మాత్రం ఎమ్మెల్యే రోజా తప్ప.. ఇంకెవరూ పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో 4 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజా కూడా సాయం చేయకుండా ఉంటే తమ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అన్ని విధాలా ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. నగరిలో మిగిలిన నాయకులు ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు.