ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.మంగళవారంనాడు రాష్ట్రంలోని 71 మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పిడుగురాళ్ల, పులివెందుల మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో ఏకగ్రీవమయ్యాయి.
71 మున్సిపాలిటీల్లో 1633 వార్డులకు పోలింగ్ జరిగింది. 12 కార్పోరేషన్లలో 581 డివిజన్లకు పోలింగ్ జరిగింది.ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపుగా పోలింగ్ కేంద్రాలలోని క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించారు అధికారులు.
మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలో 53.57 శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 66.21 శాతం, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 47.86 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేశారు.