చలికి తట్టుకోలేక ఆస్ట్రేలియాలో విశాఖ యువకుడు మృతి

Published : Aug 30, 2021, 11:36 AM ISTUpdated : Aug 30, 2021, 11:39 AM IST
చలికి తట్టుకోలేక ఆస్ట్రేలియాలో విశాఖ యువకుడు మృతి

సారాంశం

ప్రస్తుతం బీఎస్పీ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చెన్న కేశవ సాయి ఈ నెల 16వ తేదీ అక్కడ పార్క్ లో మార్నింగ్ వాకింగ్ కి వెళ్లారు.  

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన విశాఖ యువకుడు అక్కడే తుదిశ్వాస విడిచాడు.  ఉదయం వేళ పార్క్ లో నడుస్తుండగా.. తీవ్రమైన చలికి ఊపిరి అందక.. ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయాడు. కరోనా ఆంక్షలు ఉండటంతో.. ఎవరూ అతనిని కాపాడటానికి కూడా ముందుకు రాలేదు. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..  విశాఖ పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెం వుడా కాలనీకి చెందిన ప్రసంగి శ్రీనివాసరావు, కవిత దంపతుల పెద్ద కుమారుడు చెన్నకేశవ సాయి(20) మెల్ బోర్న్ లో డిగ్రీ చదివేందుకు అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం బీఎస్పీ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చెన్న కేశవ సాయి ఈ నెల 16వ తేదీ అక్కడ పార్క్ లో మార్నింగ్ వాకింగ్ కి వెళ్లారు.

 అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఊపిరిడాక అస్వస్తతకు గురై అక్కడే పడిపోయాడు. అతను అక్కడ పడిపోయిన విషయం మూడు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. బంధువులు, స్నేహితులు గాలింపు చర్యలు చేపట్టడంతో.. పార్క్ లో విగతజీవిలా కనిపించాడు. వారు ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఆదివారం యువకుడి మృతదేహాన్ని విశాఖలోని స్వగ్రామానికి చేర్చారు. ఉన్నత విద్య కోసం వెళ్లి.. ఇలా విగత జీవిలా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu